|
కట్టించి జగనొబ్బగండ్డన్న వేమభూ
విభుని...శ్వరధర్మవిభవకీర్త్తి
సకలదిక్కులు నిండి సాంద్రమై ఆచంద్ర
తారకఃస్తితి నుర్వ్వి తనరజేశె
శాంకరాగమమంత్రదీక్షావిభూతి
దంచితా[1]చారుం డగుచున్న పంచభిక్షం
రామనసుతుండు నిర్మ్మ... వంశుండు
మల్లనాఖ్యుండు శివభక్తిమార్గరతుండు.
|
|
37
ఇది గోదావరీమండలము భీమవరముతాలూకా భీమవరగ్రామములో భీమేశ్వరస్వామిగుడియెదుట నున్నమండపములో నొకస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (A. R. No. 460 of 1893)}
సీ. |
ధరం జతుర్ద్ధాన్వయాభరణుండు దేవయ
తనయుండు దూలశింగనఘనుండు
శకవర్షములు బాణసాగరరా(మే)౦ద్దు
వరసంఖ్య నగు క్రోదివత్సరమున
అరుదారంగాం గువరారామ[2] భీమేశ్వ
రునకు నొప్పార భూజనులు మెచ్చ
కళ్యాణచంద్రశేఖరమూర్త్తి౦ జేయించి
యెలమిం బుట్టడు శేను[3] విలిచి పెట్టి
(త్రో)పుఘంటయుం గంచ్చునదీపగంభ
మును సమర్ప్పించ్చి గోవులం దనర నిచ్చి
|
|
- ↑ "అంచితా" అని యుండవలెను.
- ↑ "గుమారారామ" అని యర్ధము.
- ↑ "సేను" అని యుండవలెను.