పుట:Shaasana padya manjari (1937).pdf/34

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసనపద్యమంజరి.

23


30.

శ. స. 1145

ఇది పశ్చిమగోదావరీ మండలములో ఏలూరు మసీదులో నొక స్తంభముమీఁద చెక్క -
బడియున్నది- (South Indian Inscriptions Vol. V. No. 178)
క. సరసిపురి సస్వతంబై
శరవార్ధిశశాంక భూమిశం కెమెయి న్నీసు
స్థిరుండగు (వ)యపకొమన. [1]

31.


శ. స. 1150


ఇది పశ్చిమగోదావరీమండలములో ఏలూరు మసీదులో నొక స్తంభముమీఁద చెక్క
బడియున్నది-- (South Indian Inscriptions Vol. V. No. 192)

సీ. శ్రీరమ్య మగుసరసీపురి సోమేశ్వ
రునకును విష్ణు దేవునకు భక్తి
యమరంగ నిరుసంద్ధి యలయంద్దు నెంతయు
వెలుగంగ్గ ధారుణి వ(ల)య నాయం
డగు కేశవా ధీశు నతివ శ్రీగు(డు)పూండి
గోకన౯ దేవునకును ముదమునం
బ్రాసాద మె త్తించ్చి బహుధమ్ము౯ పులయంద్దు
వరగిన మల్లా(ంబ) వరసుపుత్రి
వ్యోమసాయక భూసుధాధా(మ)సంఖ్యం
గాత్తి౯కము శుద్ధశివతథిం గాంత్తి సహితుం
డగుగదాధర దేవని యైతమాంబ
(స)ంధ్య దీపంబు లొగిం బెట్టె సాశ్వతముగ.

...................................................................................................

  1. ఇందు తప్పు లున్నవి. పద్య మసంపూర్తిగా నున్నది.