| |
కూర్మ్మనాథునకు సద్గుణి మాపగాము
శాసనుం డుపమ(న్యు)సన్మునివరేణ్య
గోత్రుం డేతమనాయకునకుం గండెమకునుం
దనయుండు వంశవర్ద్దనుండు ధర్మ్మ
విదుండు రేవన ఒంబరవెల్లినాగ
బంధమున విల్చి పుట్టెండు వం(ట్టి)[1]పొలము
దెలుపు మిగుల నఖణ్డప్రదీపమునకుం
దనరంగాం బెట్టె నాచంద్రతారకముగ.
|
|
29
ఇది గుంటూరుజిల్లా గుంటూరుతాలూకాలోని ఇప్పటముగ్రామములోని మల్లేశ్వరస్వామియాలయము నెదుట నున్నయొకఱాతిమీఁద నున్నది. (A. R. 88 of 1917)
| సీ. |
శ్రీశకరాజాభిశేకవత్సరములు
పురరామచంద్రభూపరిమితముగ
నమరంగ్గం బౌష్యమాసమున పంచ్చాదశిం
గమలాప్తదినమున విమలధర్మ్మ
మతి న్రిపచారిత్ర నుతికెక్కు గండ్డభూ
పతిసుతుం డ్డౌదార్య్యమతిం దలంచి
సమ్మతుండై కోట ముమ్మడిదేవన
రేంద్రుండ్డు విభవసురేంద్రసద్రిశుం
డభిమతార్త్థధర్మ్మవిభవశౌర్య్యోన్నతిం
దనరి వెలుంగ నిచ్చె మనుచరిత్రుం
డవని దేవతతికి భువి దాన మేర్ప్పడం
దరణి రజనికరసుతారముగ.
|
|
- ↑ ఈశబ్దము రూపము సందేహాస్పదముగా నున్నది.