Jump to content

పుట:Shaasana padya manjari (1937).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాసనపద్యమంజరీ.

17


(ప)క్షత్రితీయ్యయు మేషసంక్రాంత్తినిమిత్తము(నం) వీరబలంజ్య
ధర్మ్మనిర(తుం)డు దాచ(నై)తమసెట్టి కబ్జాతనేత్రి గేతమాంబికకు
నుం బ్రీతితనూజుండు మహితగుణాఢ్యుండు మల్లిసెట్టి
భక్తి బె(ట్టె) నాండుం బల్లిహ(హరు)నకు నఖండదీప మాదరముగనే
యిరువ(ద్వి)నుమొదవులుం బ్రసిద్ధిగాంగ.

ఈపద్యమందు తప్పులు మెండుగా నున్నవి.

—————

20

శ. స. 1112

ఇది పశ్చిమగోదావరీమండలములో ఏలూరులో మసీదుస్తంభముమీఁద చెక్కఁబడినది. (South Indian Inscriptions Vol. V. No. 184.)

క.

తరణిశివశకసమంబు(ల
స)రసి[1] సోమేశ్వరునకు సంధ్యదీప[2]
లిరుసంధ్యలం జనం గ్గాటయ
వరపుత్రుం డమాత్యయయ్తి(వర)౦గం బెట్టెను.

—————

21

శ. స. 1121

ఇది పశ్చిమగోదావరీమండలమున ఏలూరుమసీదులో నొకస్తంభముమీఁద చెక్కఁబడి యున్నది. (South Indian Inscriptions Vol. V. No. 189.)

చ.

గురుమతి మంత్రి శ్రీధరునకుం గ్గొసనాంబకు నంద్దనుణ్డు సు
స్థితుండగు[3] భీమశౌరి సరసీపురి (నొ)ప్పిన సోమనాథదే
వరకు నఖణ్డదీపము ధ్రువంబుగ నేర్ప్పడ్డం బెట్టె రోహిణీ
శ్వరకరకైరవాప్తశశిసంఖ్యశకాబ్దము లుర్వ్విం బర్వ్వంగాను.

—————

  1. "సరసీ" అని యుండనోపు.
  2. "సంధ్యాదీపం" అని యుండవలెను
  3. "స్థిరుండగు" అని యుండవలెను.