Jump to content

పుట:Shaasana padya manjari (1937).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

శాసనపద్యమంజరి.


క.

జలధినవాంబరశశిసం
ఖ్యలmకు[1]నేండ్లు[2] గార్త్తికము పున్నమ ను
జ్వలగురుదినమునం గొణ్డం
డలఘుండు దీపంబు నిల్పె హరునకు వేడ్కను.

2

—————

18

శ. స. 1094

ఇది గుంటూరుమండలములో పాములపాడుగ్రామమందు మల్లికార్జునస్వామి యాలయమునెదుట నందినాగ స్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (A. R. 121 of 1917.)

చ.

విరచితకీర్త్తిలోలుం డగువెన్నపరడ్డికిం బ్రోలసానికి
న్వరసుతుండైన బొల్లన ధ్రువంబుగం బాములపాటం బార్వ్వతీ
శ్వరున కఖణ్డదీపకము సంద్రుండు సూర్య్యుండుం గల్గునంతాకా
దరణ వెలుంగ్గం బెట్టెం దనతల్లికి దండృకి ధర్మ్ము వేర్ప్పడను.

1


క.

గతినిధిఖేంద్దుశకాబ్ద
ప్రతతిం గార్త్తికము శుక్లపంచాదశి గో
పతిదినమున బొల్ల[3]
ణ్డతులితదీపంబు నిల్పె హరునకు వేడ్కను.

2

—————

19

శ. స. 1111

ఇది పశ్చిమగోదావరిమండలములో ఏలూరుతాలూకా తడికలపూఁడిలో గాంగేయేశ్వరస్వామి యాలయము కళ్యాణమండపములో నొకస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (South Indian Inscriptions Vol. V. No. 202.)

సీ.

శ్రీశకవత్సరశ్రీశధరా(తళ)
            శశిధరమితము(గ్రాం)జైత్ర(బ)హళ

  1. శ"కు" అని యుండవలెను.
  2. ఇచట గణము తప్పినది.
  3. గణము తప్పినది.