16
ఇది గుంటూరుమండలము పాములపాడుగ్రామములో మల్లికార్జునస్వామి యాలయమునెదుట నందినాగస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (A. R. 122 of 1917.)
| ఉ. |
పాములపాటిమణ్డనకుం బంకరుహానన యేడుమాంబకుం
గామనిభుండు గొమ్మన సుఖస్థితిం బుట్టి నిజాన్వవాయసు
త్రాముండు దల్లిదండ్రులకు ధర్మ్మువుగాం దనవృత్తిపై గ్రహ
గ్రామణిం బోల దీపక మఖణ్డితమై మహిం బర్వ్వి యొప్పంగాను.
| 1
|
| క. |
సరధి[1]నిధిఖేందుసక[2]వ
త్సరసంఖ్యలం గార్త్తిక(ము)న దవలిమపూర్న్న
స్థిరగురుదినమునం గొమ్మన
యురుతరదీపంబు శివున కొప్పంగ నిల్పెను.
| 2
|
17
ఇది గుంటూరుమండలము పాములపాడులో మల్లికార్జునస్వామి యాలయమునెదుట నందినాగస్తంభముమీఁద చెక్కఁబడినది. (A. R. 120 of 1917.)
| ఉ. |
కామనిభుణ్డు భీమనకుం గామవసాన్కిం[3] బుట్టి బంధుచిం
తామణి యైనకొణ్డం డు చిత(౦)బుగం బాములపాట సజ్జన
స్తోమనుతిం బ్రదీపకము ధూర్జ్జటి కెత్తె నఖండవర్త్తి యు
ద్దామయశఃప్రకాశి దమతల్లికిం దండృకి[4] ధర్మ్ము వేర్ప్పడను.
| 1
|
- ↑ "శరధి" అని యుండవలెను.
- ↑ "శక" అని యుండవలెను.
- ↑ "సానికిం" అని యుండవలెను.
- ↑ "దండ్రికి" అని యుండవలెను.