Jump to content

పుట:Shaasana padya manjari (1937).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాసనపద్యమంజరి

11.

11

శ. స. 1074

ఇది బెజవాడలో మల్లేశ్వరస్వామి యాలయము నుత్తరద్వారమున నున్నమండపములో నొకస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (A. R. 323 of 1919.)

సీ.

శరగిరిగగణేందుసమితసకరాజ
            వత్సరంబులు బెజవాడ (ఏ)లు
నయనిధి బొద్దననారాయణుని ధనా
            ధ్యక్షి నాగార్జ్జునుం డతని అత్త
గంటమ నిజకులకమలినీకలహంస
            గుణగణాలంక్రిత గోరి నిల్పె
మల్లేశ్వరునకు సామజదైత[1]చర్మ్మాంబ
            రున కద్రికన్యావరునకు లలిత
ఖండశశిధరున కఖండద్వీప[2]జ్వాల
(ఒ)నరి యొప్పి లీలం దనరి వెలుంగ
నర్చ్చ లిచ్చి కొ(ల్వ) నవితరభక్తి నా
చంద్రతారముగం బ్రశస్తముగను.

1

—————

12

శ. స. 1075

ఇది గుంటూరుమండలము నరసారావుపేఁటతాలూకా నాదెండ్లగ్రామములో మూలస్థానేశ్వరస్వామి యాలయములో ముఖమండపము కుడిప్రక్కరెక్కతలుపుమీఁద యున్నది. (A. R. 330 of 1919.)

క.

శ్రీరమణీరమణియ్యా
కారమహోదారధర్మ్మగౌవురవ[3]కులని

  1. "దైత్య" అని యుండవలెను.
  2. "దీప" అని యుండవలెను.
  3. "గౌరవ" అని యుండవలెను.