Jump to content

పుట:Shaasana padya manjari (1937).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శాసన పద్యమంజరి.

9


దీని జేకొని నడపంగ్గంబూనె నిందు
వెలసి యెప్పుడుం దమసానివృత్తింగా జే(ను)[1]
కంటనకు నగ్రజుడు జక్కనఘనుండు
దరతరంబులు నాచంద్రతారకముగా.

—————

9

శ. స. 1070(')

ఇది గంజాముమండలము పర్లాకిమిడితాలూకా ముఖలింగములో ముఖలింగేశ్వరస్వామి ఆలయములో ఆస్థానమండపము ఎడమవరుస మూఁడవస్తంభముమీఁద దక్షిణమువైపున చెక్కఁబడియున్నది. (South Indian Inscriptions Vol. V. No. 1075.)

సీ.

శ్రీకరశుభకర(కా)బ్ధములు వియ
            న్మారుతవ్యోమసోమస్తుతముగ
సితతరైకాదశి నుతభౌమదినమునం
            (గాని)[2]మాసంబునం గంసరిపుండు
(పా)లమున్నీరిలోం (బ)వ్వడించిన (తి)థిం
            బితృదేవతల కతిప్ప్రితిగాంగ
విశ్వేశండగు మదుకేశ్వరదేవర
            (కా)చంద్రతారక మగుచు న(మ్మి)
దివ్యమగు నఖణ్డదీపంబు వెట్టె జు
ట్టేశు కట్టానుంగ్గు[3] సాసనికుండు
ధీయుతుండ్డు గాపినాయకుకూరిమి
తమ్ముం డెఱి ... యన్వితుదర్మ్మనుతుండై[4].

—————

  1. "వృత్తింగాను" అని యుండనోపు.
  2. కాని శబ్దము శూన్య మనునర్థమందుఁ బ్రయోగింపఁబడిన దని తోఁచుచున్నది.
  3. "కట్టనుంగ్గు" అని యుండవలెను.
  4. "సుతుండు" అని యుండవలయును.