Jump to content

పుట:Shaasana padya manjari (1937).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

శాసనపద్యమంజరి.

2

శ. స. 1054

ఇది గుంటూరుజిల్లా సరసారావుపేఁటతాలూకాలోని తూపాడుగ్రామములో వినాయకుని యాలయము గర్భగుడిసమీపమున నిల్పఁబడిన నాగశిలమీఁద చెక్కఁబడియున్నది. (A. R. 441 of 1915.)

క.

శ్రీసహితుండు దూంబఱితిసు
శాసనుం డనియంకభీము చక్రము లీలా
వాసుండు సతుర్త్థ[1]కులగిరి
కేసరి గాపండు జగజ్జిగీషుండు పేర్మ్మిని.

1


చ.

అడపయు నందలంబు వివిధాతవారణకాహళావలిం
బడియము నాదిగాంగల న్రిపాలకచిహ్నలు బుద్ధవర్మ్మచేం
బడసినవాడు నాయకసభామణి సి(ద్దప)నాయకాంకుం డి
ప్పుడమిం దదీయవీరభటపుంగ్గవుమనుమం డుదాత్తసంప్పదను.

2


క.

సేవనియు సింగనయు జగ
దేవండుం (జోడ్ల)నుం[2] జూడ దీరిక మండ
క్ష్మావలయేశ్వరుపన్పునం
బావని రఘునాథుచేతం బనివడినక్రియను.

3


శా.

తన్నగ్గించుచు నెఱ్ఱమండణ్డు బుధాధారుండు పన్పంగ న
మన్నే(ట)౦గనయంబుల న్రిపులకు న్మార్ప్పెట్టి యోడించ్చి పే
ర్కొన్న న్మణ్డనగంధవారణసమాఖ్యుం జేసి తూంబఱ్తిపై
నెన్న న్వ్రిత్తిగ నాతుకూరు దయతో నిచ్చె న్నిజస్వామియును.

4


చ.

శకసమసంఖ్య వారినిధిసాయకఖేంు మితంబుగాంగ గా
ర్త్తికసితపక్షతేరసముం దీవ్రకరాము[3]నం దఖండదీ

  1. "చతుర్త్థ" అని యుండవలెను.
  2. ఈయక్షరములు స్పష్టముగా లేవు.
  3. "దీవ్రకరాహము" అని యుండనోపు.