శాసనపద్యమంజరి
ద్వితీయభాగము
1
ఇది గుంటూరుజిల్లా నర్సారావుపేఁటతాలూకాలోని నాదెండ్లగ్రామములో నొకపొలములోఁ బడియున్న ఖిన్నమయిన యొకఱాతిమీఁద చెక్కఁబడియున్నది. (A. R. 395 of 1915.)
శా. |
శ్రీమద్ధర్మ్మపరాయణులు బుధజనాశీర్వ్వాదవంతులు దయా
ధాములు సర్వ్వజనానురక్తు లఘవిధ్వస్తాత్ము లుద్యద్యశో
రామారాములు వైశ్యవంశులు[1]గుబేరప్రాభవులు గోమినీ
భామాధీశపదాబ్దభక్తులు జగత్ప్రఖ్యాతతేజోధికులు.
| 1
|
ఉ. |
లాలితవిత్తదాన్వయలలాముణ్డు పుణ్యయశోధనుణ్డు మొ
క్కోలకులోత్తముణ్డు పెనుంగొణ్డవిభుణ్డు ప్రభుణ్డు సత్యవా
క్శీలుణ్డు ధారుణిం గొసనిసెట్టికిం బ్రోలమకును సుతుణ్డు ల
క్ష్మీలలనేశ్వరస్తరణసేముషి గోమనయును ముదంబుతోను.
| 2
|
మ. |
ధరణీశోత్తము ణ్డైనశ్రీశకనృపాబ్దంబులు రసోదన్వదం
బరచంద్రస్థితసంఖ్య మాఘసితశుంభత్పంచమిం బార్వ్వతీ
శ్వరు విశ్వేశ్వరు భక్తితో నిలిపి విశ్వస్తుత్యులై దేవమం
దిర మెత్తించిరి వంశవర్ద్ధనులు (నాది)ణ్డ్లం జిరస్థాయిగాను.
| 3
|
- ↑ "వంశ్యులు" అని యుండవలెను.