అయితే ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం, డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం లాంటివి ఒక స్థాయిని అధిగమించిన సిద్ధాంతాలు. ఇలాంటివి పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కుతాయి. శాస్త్రవేత్తల చేతుల్లో ఉత్పాదక క్రియా సాధనాలుగా మారతాయి. ఆ గౌరవం ఆస్థానం వాటికుంది.
కానీ సైన్సు ప్రత్యేకత ఏమంటే అందులోని ఏ సిద్ధాంతము శాశ్వతంగా నిరూపితమైనట్టు కాదు.కొత్త వాస్తవాలు వెలుగు చూసిప్పుడు, కొత్త పరిశీలన జరిగినప్పుడు ఈ సిద్ధాంతాలు మళ్ళీ మళ్ళీ పరీక్షకు నిలవాల్సి ఉంటుంది. నిగ్గుదేలాల్సి ఉంటుంది.
తనను తాను నిరంతరం ఇలా నిగ్గు దేల్చుకొనేందుకు నిలబడే ఈ స్వభావమే సైన్సుకున్న విలక్షణ లక్షణం. మానవ జాతి ప్రకృతి గతిక్రమాన్ని అర్ధం చేసుకొనే ప్రయత్నంలో సైన్సుకింత స్థానం దక్కడానికి ఈ లక్షణమే మూలకారణం.
అయితే మరి సైంటిస్టులు ఎలాంటి వారు? కళ్లజోడు ముక్కు చివరికి వేలాడదీసుకొని, తెల్లకోటు తొడుక్కొని ఈ లోకంతో ఏ సంబంధం లేకుండా బిగుసుక్కూచున్న వాళ్ళలా కార్టూన్లలో మనకు శాస్త్రవేత్తలు దర్శనమిస్తుంటారు. వీళ్ళెప్పుడూ పొరపడరని కూడా లోకం అనుకుంటుంది. ఇది వాస్తవమేనా?
సైంటిస్టులేమీ ఒక ప్రత్యేక జాతి కాదు. వాళ్ళూ మనలాంటి మానవులే. అన్ని రూపాల, అన్ని సైజుల, అన్ని జాతుల మానవుల్లోనూ సైంటిస్టులుంటారు. స్త్రీ పురుషుల్లోనూ శాస్త్రవేత్తలుంటారు. కళ్ళద్దాలున్న వాళ్ళూ ఉంటారు. లేని వాళ్ళూ ఉంటారు! కాకుంటే ఏది తప్పో మనకంటే వాళ్ళకి బాగా తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు పాటించే పద్ధతి పొరపాట్లకు తక్కువ అవకాశమిస్తుంది. ఆ నిర్ధిష్ట పద్ధతికున్న ప్రత్యేకత అది.
అవకాశం ఉన్నంతవరకూ సరిగానే ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. ప్రతి సవాలుకూ సరైన సమాధానాల్ని వెతకడానికే వాళ్ళు ప్రయత్నిస్తారు.
(On the shoulders of the saint 'HISTORY OF SCIENCE' by Ray Spange-jburg & Daine K. Moser University's Publication లోని THE SCIENTIFIC METHODకు అనువాదం)
అనువాదం: వి. బాలసుబ్రహ్మణ్యం
సైన్సు ఎలా పుట్టి పెరిగింది?
63