ప్రకృతి మన ముందు ఎన్నో ప్రశ్నల్ని ఉంచుతుంది. వీటికి సమాధానం వెతుక్కోవడం మరొకక సవాలు. ఈ ప్రకృతి రహస్యాల్ని ఛేదించడం కోసం పరిశోధకుడు పూనుకొనేటపుడు తన స్వంత (పూర్వ నిర్ణీత) అభిప్రాయాల్ని పక్కన పెట్టాలి. వస్తుగతంగా మాత్రమే చూడాలి. మొదట పరిశీలన చెయ్యాలి. తర్వాత ప్రయోగం చేసి చూడాలి. తర్వాత సమాచార సేకరణ చేసుకోవాలి. ఆ తర్వాత నిర్ధారణకు రావాలి.
ఇదీ శాస్త్రీయ పద్ధతి అంటే
న్యూటన్ విశ్వాకర్షణ సూత్రాన్ని ప్రతిపాదించాడని మనకు తెలుసు. ఈ ఆకర్షణకు సంబంధించి ముందుగానే ఆయనకు ఒక ఊహ ఉండి ఉంటుందని చాలామంది అభిప్రాయపడ్డారు. న్యూటన్ శాస్త్రవేత్త పాత్రలో ఈ ఊహకు (Hypotheses) ఏమాత్రం స్థానం లేదు. 'నేను చేస్తున్నది ఊహించడం కాదు' అని న్యూటన్ చాలా గట్టిగా చెప్పేవాడు. ఈ ఆకర్షణకు సంబంధించి రెండు ఊహలు న్యూటన్‌కు ఉండేవని చరిత్రకారులంటారు. కానీ ఇవన్నీ న్యూటన్ ప్రైవేటుగా మాత్రమే ఉంచుకొన్నాడు.
అలాగే న్యూటన్ విశ్వాకర్షణ సూత్రం కోసం చేసిన పరీక్షలూ, సేకరించిన సమాచారమూ కూడా ఏమీ లేదు. అంతా ఆలోచనల ప్రాతిపదికగానే సాగింది.
శాస్త్రీయ పద్దతి గురించి మనం ముందు చూశాం. దీన్ని ఒక నిర్ధారిత మార్గంగా స్వీకరించి తూచ తప్పకుండా ఈనాటి శాస్త్రవేత్త లందరూ పాటిస్తున్నారని కూడా మనం చెప్పలేము. కొన్ని సందర్భాల్లో శాస్త్రవేత్తకు తమ ప్రయోగానికి ముందుగానీ తర్వాత గానీ కొన్ని కొత్త ఆలోచనలు రావచ్చు. తన అన్వేషణకోసం అవి కొత్త కోణాల్ని చూపొచ్చు. కానీ శాస్త్రవేత్త ఇవి ఎంత వాస్తవాలో, ఎంత వాస్తవాలు కావో నిరూపించుకోడానికి ప్రయోగాలు చేస్తాడు. సమాచారం సేకరిస్తాడు. ఇలా ఆ ఊహ శాస్త్ర నిరూపణకు స్థిరపడాలి. అప్పుడది వాస్తవం కాకపోవచ్చు. అలాకాక పోవడానికి క్కూడా సిద్దపడి అది నిరూపణకు నిలబడాలి. లేకుంటే శాస్త్రరంగంలో దానికి స్థానం లేదు. అర్ధం లేదు. ఇలా నిరంతరాగ్ని పరీక్షలో నిగ్గుదేలాక ఈ ఊహ ఒక సిద్ధాంతంగా రూపొందుతుంది.
మనం గమనించాల్సిందేమంటే ఈ సిద్ధాంతం కూడా సరైంది కాకపోవచ్చు. అలా ఒకనాడు నిరూపణ కావచ్చు. అందుకది సిద్ధపడాల్సి ఉంటుంది. శాస్త్రవేత్తలు సైతం దాన్నలానే చూడాల్సి ఉంటుంది. మంచి సిద్ధాంతం ఎప్పుడూ జరగగలవాటిని కొన్నిటిని చెపుతుంది. వీటిని శాస్త్రవేత్తలు మళ్లీ పరీక్షకు పెడతారు. దీన్ని ఆధారం చేసుకొని ఆ సిద్ధాంతపు తప్పొప్పులు తేలుస్తారు.
సైన్సు ఎలా పుట్టి పెరిగింది?
62