Jump to content

పుట:Science Ela Putti Perigindhi VBS JVV.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భూమి పుచ్చకాయలా ఉందా, ఆపిల్‌పండులా ఉందా!

పుచ్చకాయకీ ఆపిల్‌కీ తేడా తెలుసుగా? రుచిలో అనుకునేరు! కాదు లెండి. ఆకారంలో! రెండూ గోళాల్లాగా ఉంటాయి. కాని పుచ్చకాయ పైనా కిందా సాగి ఉంటుంది. ఆపిల్ నొక్కుకుని ఉంటుంది. (అంటే ప్రతి పండూ అలానే ఉంటుందని కాదు లెండి. ప్రకృతిలో పరమ వింతగా ఉండే పుచ్చకాయలూ, ఆపిల్ పళ్లూ కనిపించవచ్చు. కాని మనం మామూలుగా ఉండే ఆకారాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం.)

17వ శతాబ్దం ఉత్తరార్ధం దాకా భూమి పూర్ణగోళంగా ఉందని ప్రతివాళ్లూ అనుకున్నారు. అప్పుడు ఉన్నట్టుండి సందేహాలు పుట్టుకొచ్చాయి. పారిస్ సైన్స్ అకాడెమీ భిన్నభిన్న ప్రాంతాల్లో రేఖాంశాల పొడుగుని కొలిపించడంతో మొదలైంది ఇదంతా. భూమి ధృవాల దగ్గర కొంచెం సాగి ఉందని అకడమీషియన్లు నిర్ధారణకి వచ్చారు. అంటే కొంచెంగా పుచ్చకాయ ఆకారంలో ఉందని.

ఇంగ్లీషు శాస్త్రవేత్త ఐసక్ న్యూటన్ దీన్ని ఒప్పుకోలేదు. ధృవాల దగ్గర కోసుగా కాకుండా చప్పిడిగా వుందని ఆయన లెక్కగట్టాడు. డచ్ శాస్త్రవ్తే క్రిస్టియన్ హ్యూగెన్స్ న్యూటన్‌ని బలపరిచాడు. భూమి తన అక్షం మీదనే పరిభ్రమిస్తోంది కాబట్టి కొంచెంగా చప్పిడిగా ఉండాలని ఆయన వాదించాడు. తన వాదనని రుజువు చేసుకుందుకు ఓ కర్ర చివర బంకమన్ను ముద్దని పెట్టి గబగబా తిప్పడం మొదలు పెట్టాడు. క్రమేపీ ఆది యాపిల్ ఆకారం తేలింది.

ఈ వాదన తీవ్రం అయింది. “భూమి ధృవాల దగ్గర కోసుగా ఉంది" అని ఫ్రెంచివాళ్ళు బల్ల చరిచి అన్నారు. 'చదునుగా' అని ఇంగ్లీషు వాళ్ళు గొంతు చించుకున్నారు. ఈ వాదనని పరిష్కరించాలి అన్చెప్పి రేఖాంశాలని కొలవడానికి శాస్త్రజ్ఞుల బృందాన్ని

సైన్సు ఎలా పుట్టి పెరిగింది?

51