నుంచి రాజస్తాన్‌కు పాకిపోయింది. ఈ పల్లెటూరి టాక్సీ' ధర కూడా బాగా పడిపోయింది. స్వంతదారుడల్లా రిపేర్లు నేర్చుకోడంతో 'పోషణాపాలనా” మరింత సులువై కంపెనీ వాహనాలకు కష్టకాల మొచ్చేసింది. (పాపం రోడ్డు రవాణా అధికార్లకు ఎక్కడలేని చిక్కూ చిరాకూ పుట్టుకొచ్చి ఉంటాయి!)
ఇలాంటిదే మరో కథ : అతడు పాటియాలలో మరో రైతు. అక్కడో వ్యవసాయ విజ్ఞాన కేంద్రం వుంది. దీని సాయంతో అక్కడి రైతులు సంవత్సరానికి నాలుగు పంటలు పండిస్తున్నారు. అయినా సరిపెట్టుకోక మన రైతు ఒకరోజు ఆ కేంద్రానికి వెళ్లి నేను మధ్యంతర పంటగా పొద్దుతిరుగు వేశాను' అని అక్కడి శాస్త్రజ్ఞులకు సెలవిచ్చాడు. వాళ్ళకి చిర్రెత్తుకొచ్చింది. ఆశబోతు అమాయక శిఖామణి అనుకొని 'పొద్దు తిరుగుడు వేస్తే పక్షులెక్కువై అసలు పంటకే ఎసరు వస్తుంది తెలుసుకో' అని మందలించారు. అందుకారైతు 'ఇన్నేళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నా ఆ మాత్రం తెలిదా నాకు. అందుకే పొలంలో తేనెటీగల్ని కూడా పెంచుతున్నా' అని వాళ్ళని 'ఓరి పిచ్చిదద్దమ్మల్లారా' అన్నట్టు చూచాడు.
తేనెటీగలు పక్షుల్ని తరుముతాయా? పక్షులకు ప్రత్యామ్నాయ ఆహారమిచ్చి పంట జోలికి పోకుండా చేస్తాయా? వీటికి జవాబు దొరక్క ఏ పిహెచ్.డి.కి దీన్ని ఎవ్వరూ సబ్జక్టుగా తీసుకొన్న దాఖలా కన్పించక శాస్త్రజ్ఞులు జుట్టు పీక్కొన్నారు. రైతు మాత్రం నాలుగు పంటలు, పొద్దతిరుగుడుతో పాటు కావల్సినంత తేనె కూడా 'పండించుకొన్నాడు'.
ఇలాంటి 'కథ'లు ఎన్నైనా చెప్పొచ్చు. వీటిని విన్నప్పుడే మన్పిస్తుంది? మానవుడు ఆదిమ గుహాంతరాల నుంచి ప్రస్థానం ప్రారంభించి సహస్రాబ్దాల సముద్రాల్ని ఈదుకొంటూ ఇంత దూరం ప్రయాణించాడు.
ఇలా చూస్తే సామాన్య మానవుడి శ్రమైక జీవన సౌందర్యం, అనుభవ పాండిత్యం, వ్యవహార విజ్ఞానం, ఆలోచనా శైలి, నైపుణ్యం, కళాకౌశలం కంటే శాస్త్రాన్ని ఇంత దూరం నడిపించిన శక్తులేమున్నాయి? మన ఇతిహాస పురాణ కావ్యాల రచయితలుగా, కవులుగా కొందర్ని మనం చెప్పుకోవచ్చు. కానీ వీటి మూలాల్ని అనామక సామాన్య మానవ జీవన స్రవంతిలో కదా మనం వెతకాల్సింది. నేడు ఆయుర్వేద ఔషధాలు ఏ మహానుభావుల పేర్లతోనైనా చలామణీ కావచ్చు. కానీ వాటిని వెతికి పట్టుకొన్నదీ, వాటిని పరీక్షించిందీ, తరాన్నించి తరాని కందించిందీ మన 'అనాగరిక ఆటవికు'లని గదా మనం గుర్తించాల్సింది! చెకుముకి నుంచి నిప్పు రాజేసినవాడు, దుంగల నుంచి చక్రాన్ని దొర్లించినవాడు సగటు మనిషిగాక మరెవ్వడు? సమష్టి జీవన పోరాటం నించి గాక నిప్పెలా పుట్టగల్గింది? చక్రమెలా పరిభ్రమించగల్గింది? శాస్త్రం పెరిగాక, పరిశోధనా సంస్థలు వెలిశాక సూక్ష్మాతిసూక్ష్మ, జటిలాతిజటిల రహస్యాల్ని ఛేదించే రోజు వచ్చాక శాస్త్రమూ, సగటు మనిషీ ఎవరికివారై పోతున్నారా?
ఈ సహస్రాబ్దపు మహా మేధావులెవ్వరు? తత్వవేత్తలెవ్వరు? పరిశోధకులెవ్వరు? కవులెవ్వరు? కళాకారులెవ్వరు అని మనం చేసే సర్వేలలో ఈ సామాన్యులకు స్థానమెక్కడ?
ప్రొఫెసర్ యశ్‌పాల్. ఆధారం 'ప్రోత్'
సైన్సు ఎలా పుట్టి పెరిగింది?
50