ఈ సంకేతాలు చూడండి. మొదటిది ఆవుది, రెండో ఎద్దుది. విచిత్రం ఏమంటే పై మేకకీ ఈ ఎద్దుకీ మధ్య 10-15 వేల సంవత్సరాల చరిత్ర వ్యవధి ఉంది.
కాలం దొర్లే కొలదీ ఈ గుండ్రటి సంకేతాలు రాయడం కంటె వంకర సంకేతాలు రాయడం సులభమని ప్రాచీన మానవుడు గుర్తించాడు. చివరికి పై ఆవు ఇలా పరిణామం చెందింది.
ఇంతవరకు బాగానే ఉంది. ఓ వస్తువుకి ఓ గుర్తు లేదా బొమ్మ ఎలాగో తంటాలు పడి తెలుసుకొంటాం. మరి పదాలూ వాక్యాలూ ఎలా రాసేవారు? వాటిని చదవడం మనకెలా సాధ్యమైంది?
మొదటి పదాలు పైరకంగా ఉండేవి. ఒక్కో బొమ్మ ఒక్కో ధ్వనికి సంకేతం. అంటే సంకేతాలు మొత్తం వస్తువుకి గాక అందులోని ధ్వనులకి వచ్చేశాయి. ఇప్పుడో సమస్య ఎదురైంది. అన్నీ బొమ్మల వరుసలే అయితే ఎటు నుండి ఎటు చదవాలి? దీనికి ప్రాచీన మానవుడు పెట్టుకొన్న నియమం ఏమంటే ఇందులో పక్షులూ జంతువులూ ఏ వైపు తిరిగి ఉంటే ఆ వైపుకు చదువుతూ పోవాలి! ఈ రహస్యం తెలియడానికీ, వీటిని చదివి అర్ధం చేసుకోడానికీ మనకు ఏళ్లూ పూళ్లూ పట్టిందంటే నమ్మండి.
దీన్ని మొట్టమొదట ఫ్రాన్సులోని పోలియోలు సాధించారు. 'రోజేటా'లోని ఒక బండ మీద మూడు లిపుల్లో ఒకే 'సందేశం' రాసి ఉండటం వారు గుర్తించారు. అందులో 'అయనాని' లిపి ఒకటి. ఇది వారికి బాగా తెలుసు. మరొకటి ప్రాచీన ఈజిప్టు లిపి. ఇది వారికే మాత్రం తెలియదు
14 ఏళ్ళ పరిశోధన అనంతరం వీళ్ళు కనిపెట్టిన దేమిటంటే ప్రాచీన ఈజిప్టు లిపిలో ఏదైనా ‘పేరు’ రాయాలంటే దానిచుట్టూ ఓ ఫ్రేమ్ (box) ఉండేది. టాలెమీ, క్లియోపాట్రా, అలెగ్జాండ్రస్‌లకు ఈ ఫ్రేంలను మనం పై చిత్రంలో చూడొచ్చు.
యునానీ భాషను బట్టి ఈ ప్రాచీన ఈజిప్టు లిపిలోని వ్యక్తుల పేర్లు ఈ ఫ్రేంల ఆధారంగా గుర్తించి, అందులోని సంకేతాల్ని ఒక పేరులోనివి మరోదానితో పోల్చుకొని ఏ సంకేతం ఏ ధ్వనికి ఉద్దేశింపబడిందో పసిగట్టేశారు!
'మైకేల్ వెంట్రిస్' అనే 14ఏళ్ళ బాలుడు 'క్రోట్' ద్వీపంలోని పురాతన లిపి రహస్యాన్ని సైతం 17 ఏళ్ళు పరిశోధించి 1952లో ఇలానే బయటపెట్టాడు! ప్రాచీన లిపి గుట్టు రట్టు కావడం వెనక ఇంత కథ ఉంది మరి!
సైన్సు ఎలా పుట్టి పెరిగింది?
48