ద్యుబువా పట్టుకొన్న 'మాయదారి లింకు'
“అదిగో అలా చూడండి. ఆ నది ఒడ్డున వంగిన కాళ్ళతో ఊగుతూ ఊగుతూ ఎవరో వ్యక్తి నడుస్తున్నాడు. ఉన్నట్టుండి కూర్చుంటున్నాడు. ఆ పెద్ద రాయిలో ఏం కన్పించిందో ఏమో, దాన్ని తీసుకొని, జాగ్రత్తగా అటూ ఇటూ తిప్పి పరిశీలించి దానితో ఇంకో రాతిని కొడుతున్నాడు. మళ్లీ నించుంటున్నాడు. తనకి దొరికిందాన్ని భారంగా మోసుకెళుతున్నాడు.”
ఇంతకూ ఇప్పుడు మనం చూచింది, చూచినట్టు ఊహించుకొంది ఎవర్ని? ఇంకెవర్ని? అక్షరాలా మన తాతగారు ఫిథెకాంత్రపస్ గారినే. ఫిథెకాంత్రపస్ చదునైన నుదుటితోటీ, ముందుకు పొడుచుకొచ్చిన ముఖంతోటీ, పొడుగాటి జుట్టుమయమైన చేతులతోటీ అచ్చం కోతిలా గానే ఉండేవాడు. ఒక్కటే తేడా.” ఇతడు నిటారుగా అచ్చం మనిషిలాగే నడుస్తాడు. ఈతడి ముఖం కోతి ముఖమే గానీ మనిషి ముఖానికి కొంత దగ్గరగా ఉంటుంది ! ఇతడే మన నరవానరుడు. జీవశాస్త్ర పరిభాషలో మానవ పరిణామక్రమంలో వానరుడికీ నరుడికీ మధ్య లింకుగా భావిస్తున్న 'మహనీయుడు'!
ఇంత 'కథ' నడిపిన ఈ నర వానరుడి అవశేషం ఒక్కటీ చిక్కకుండా ఇదెలా నిర్ధారణ అయ్యేట్టు?
సైన్సు ఎలా పుట్టి పెరిగింది?
39