కాలం మాయమవుతుందో సెకన్లతో సహా లెక్కగట్టవచ్చు. అంతవరకు బాగానే ఉంది.
రూమర్‌కి కన్పించిన మరో వింత ఇక్కడే ఉంది. అదేమంటే ఇలా 'ఇయో' ఉపగ్రహం మాయమయ్యే సమయం ఎప్పుడూ ఒకేలా లేదు. ఒకసారి ఎక్కువకాలం మాయమైతే మరోసారి తక్కువ కాలం మాయమవుతోంది. ఇలా ఎందుకు జరుగుతున్నట్టు?
దీన్ని సులభంగానే రూమర్ గుర్తించాడు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది గదా. అందువల్ల అది గురుగ్రహానికి ఒకప్పుడు దూరంగా, మరొకప్పుడు దగ్గరగా ఉంటుంది. ఇలా భూమి గురుగ్రహానికి దగ్గరగా ఉన్నపుడు 'ఇయో' మాయమయ్యే కాలం ఎక్కువగా ఉంది. ఈ రెండు కాలాల మధ్య వ్యవధి గరిష్ఠం 1000 సెకన్లుగా ఉంది!
ఆశ్చర్యంగా ఉంది గదూ తల్లి గ్రహం చుట్టూ ఉపగ్రహం చేసే ప్రదక్షిణం ఎప్పుడూ స్థిరంగా వుండాలిగానీ భూమి స్థానాన్నిబట్టి ఎక్కడం, తగ్గడం ఏమిటి?
రోమర్ ఆలోచన తళుక్కుమంది!
ఏదైనా ఒక వస్తువు కన్పించాలంటే దాని నుంచి బయల్దేరిన కాంతి మన కంటికి చేరాలి గదా అంటే కాంతి అంతదూరం ప్రయాణించాలి గదా! 'ఇయో' కాంతి కూడా మన కంటిని చేరితేనే అది మనకు కన్పిస్తుంది. మనం భూమి నుంచి దాన్ని చూస్తున్నాం. భూమి ఒకప్పుడు గురువుకు దగ్గరగా, ఒకప్పుడు దూరంగా (సూర్యుని చుట్టూ తిరుగుతున్నందు వల్ల) ఉంటుంది. భూమి దూరంగా ఉన్నపుడు కాంతి ఎక్కువ దూరం ప్రయాణించాలి. దగ్గరగా ఉన్నపుడు తక్కువ దూరం ప్రయాణిస్తే చాలు అంటే 'ఇయో' నుంచి ప్రయాణించాల్సిన కాంతి దూరం మారుతోందన్న మాట!
పటంలో భూమి 1వ స్థానానికీ, 2వ స్థానానికీ మధ్య దూరం 186 కోట్ల మైళ్ళు. అంటే ఇయో నుంచి వచ్చే కాంతి ఒకసారి ఇంత దూరం ఎక్కువగా, మరోసారి ఇంత దూరం తక్కువగా ప్రయాణించాల్సి వస్తోందన్నమాట. దీనికి (గరిష్ఠం) 1000 సెకండులు పడుతోందన్న మాట.
అంటే కాంతి వేగం 1,86,00,000. అంటే సెకండుకు అక్షరాలా ఒక లక్షా ఎనభై ఆరువేల మైళ్ళు! రూపర్ ప్రయోగంతో గెలీలియో నిర్ధారణ తప్పని తేలింది. అలా తప్పుగావడానికి కారణం మనం సులభంగా గుర్తించవచ్చు. పాపం గెలీలియో ప్రయోగంలో కాంతి కేవలం నాలుగు మైళ్ళు ప్రయాణించాలి. అంత చిన్న దూరాన్ని కాంతి చేరే వేగం కొలవడం అసాధ్యం. అంతటి గడియారం అతని వద్ద లేదు. రూమర్ ప్రయోగంలో కాంతి పయనించాల్సిన దూరం 45 కోట్ల మైళ్ళు! (గురుగ్రహానికీ భూమికీ మధ్య దూరం).
ఆనాటికీ ఈనాటికీ హిమాలయ శిఖరమంతటి ఉన్నతుడైన గెలీలియో లాంటి ఖగోళ శాస్త్రజ్ఞుడు చెప్పిన వాదాన్నే రూమర్ త్రోసిరాజన్నాడు. 'విస్సన్న చెప్పిందే వేదం' అనుకొంటే సైన్సు కిది సాధ్యమయ్యేనా?
మహీధర గారి 'గ్రహణాల కథ' ఆధారంగా
సైన్సు ఎలా పుట్టి పెరిగింది?
26