Jump to content

పుట:Science Ela Putti Perigindhi VBS JVV.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విస్సన్న వేదం తారుమారు

గురువుగారు కొండ కొమ్మ మీద నిలబడ్డారు. శిష్యుడు సరిగ్గా మైలు దూరంలో నిలుచున్నాడు. గురువు చేతిలో దీపం ఉంది. శిష్యుడి చేతిలో అద్దం ఉంది.

గురువుగారు దీపం మూత తీయగానే వెలుతురు అద్దం మీద పడుతుంది. అది గురువుగార్కి స్పష్టంగా కన్పిస్తుంది. ఇలా అంతా అమర్చుకొన్నారు. గురువుగారు దీపం మూత తీయడానికీ, అద్దంలో వెలుతురాయనకు కనిపించడానికీ మధ్య కాలం ఎంత? ఈ కాలాన్ని కొలవాలని గురువుగారి భగీరథ యత్నం. దీనికోసం ఆయన ఒక లోలకం సిద్ధంగా ఉంచుకొన్నాడు.

అంతా బావుందిగానీ అనుకొన్నట్టేమీ జరగలేదు. సున్నా సెకండులోనే గురువుగార్కి అద్దంలో కాంతి కన్పిస్తోంది. ఒక్కక్షణం కూడా వ్యవధి ఉండటం లేదు. అంటే కాంతి వేగం అనంతమా?

శిష్యుడు మరో మైలు దూరంలో నిలబడ్డాడు. ఇప్పుడు ఇటూ అటూ కాంతి ప్రయాణించే దూరం నాలుగు మైళ్ళవుతుంది. అయినా ఫలితం కనిపించలేదు. వ్యవధి ఏమాత్రం కనిపించడం లేదు. ఇంకేముంది గురువుగారు ఒక నిర్ధారణ కొచ్చేశారు. కాంతివేగం అనంతం. ఎంత దూరమైనా అది సున్నా సెకండులోనే ప్రయాణిస్తుందనేది ఆయన నిర్ధారణ. ఇది 1642నాటి సంగతి. ఇంతకీ ఎవరనుకొన్నారీ గురువుగారు? సాక్షాత్తు ఆయన గెలీలియో! ఆనాటి శాస్త్రజ్ఞులకే తలమానికం!

మరి కాంతికి వేగం ఉందనీ, అది సెకండుకు 1,86,000 మైళ్ళని మనందరం ఒప్పుకొంటున్నాం గదా. ఇదేమిటి అనే ప్రశ్న మీకూ రావచ్చు. ఇది మరోకథ. డేనిష్ శాస్త్రజ్ఞుడు ఓలాన్‌రూమర్ కథ.

రూమర్ గురుగ్రహాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాడు. మన భూమికి లాగే గురుగ్రహానికీ ఉప గ్రహాలున్నాయి. అవి గురుగ్రహానికి మన చంద్రుడిలాగే నిత్యం ప్రదక్షిణ చేస్తుంటాయి. ఇలాంటి ఉపగ్రహాల్లో 'ఇయో' ఒకటి.

ఈ ఇయో ప్రదక్షిణం చేసేపుడు గురుగ్రహచ్ఛాయలో ప్రవేశించి కొద్ది కాలం మాయమైపోతోంది. ఇలా ఎంత

సైన్సు ఎలా పుట్టి పెరిగింది?

25