పుట:Saundarya-Lahari.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

71


ఈశ్వరునియొక్కయు, భృతః = అధికారములనుపొందిన బ్రహ్మవిష్ణురుద్రేశ్వరులు, తే = నీకు, మంచత్వం = మంచమగుటను, గతాః = పొందిరి. (సన్నికృష్టసేవకొఱకు వారునలువురు నాలుగుకోళ్లై మంచమును మోయుచున్నారు.) శివః = శివతత్వాత్మకు డగు అధికారి, స్వచ్ఛచ్ఛాయాకపటఘటితప్రచ్ఛదపటః-స్వచ్ఛ = తెల్లనైన, ఛాయా = కాంతియనే, కపట = వ్యాజముచేత, ఘటిత = చేయఁబడిన, ప్రచ్ఛదపటః = కప్పుడుదుప్పటియై, త్వదీయానాం = నీసంబంధములైన, భాసాం = ఎఱ్ఱనికాంతులయొక్క, ప్రతిఫలనరాగారుణతయా-ప్రతిఫలన = ప్రతిబింబించుటచేతనైన, రాగ = రంగుచేత, అరుణతయా = ఎఱ్ఱనివాఁడగుటచేత, శరీరీ = తనువునుదాల్చిన, శృఙ్గారఃరసఇవ = శృంగారరసమువలె (శృంగారరస మెఱ్ఱనిదని కవిసమయము), కుతుకం = వేడుకను,దోగ్థి = కలుగఁజేయుచున్నాఁడు.

తా. తల్లీ, బ్రహ్మవిష్ణురుద్రమహేశ్వరులు నలువురు నీమంచమునకు నాలుగుకోళ్లై నిన్ను సేవించుచున్నారు. శివుఁడు తెల్లనికాంతి యనుమిషతో నిన్నావరించి నీకుఁ గప్పుడుబట్టయై నీయెఱ్ఱనిమేనికాంతులచే తానును ఎఱ్ఱనై మూర్తీభవించిన శృంగారమువలె నున్నాఁడు.

అరాళా కేశేషు ప్రకృతిసరళా మందహసితే
శిరీషాభా చిత్తే దృషదుపలశోభా కుచతటే,
భృశం తన్వీ మధ్యే పృథురురసిజారోహవిషయే
జగత్త్రాతుం శమ్భోర్జయతి కరుణా కాచిదరుణా. 93

టీ. హేభగవతి = ఓదేవీ, కేశేషు = తలవెండ్రుకలయందు, అరాళా = వంకరయైనదియు, మన్దహసితే = చిఱునగవునందు, ప్రకృతిసరళా-ప్రకృతి = నైజముచేతనే, సరళా = సుకుమారమైనదియు, చిత్తే = మనస్సున, శిరీషాభా = దిరిసెనపూవువలె మృదునైనదియు, కుచతటే = స్తనప్రాంతమున, దృషదుపలశోభా = సన్నెకంటివంటిదియు, మధ్యే = నడుమునందు, భృశం = మిక్కిలి,