పుట:Saundarya-Lahari.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

63


వలన, అయం = ఈ, గురుః = గొప్పదైన, విస్తీర్ణః = వెడఁదయైన, నితమ్బప్రాగ్భారః-నితమ్బ = మొలవెనుకపట్టుయొక్క (పిఱుఁదులు), ప్రాగ్భారః = అతిశయము, అశేషాం = సర్వమగు, వసుమతీం = భూమిని, స్థగయతి = కప్పుచున్న, లఘుత్వమ్ = చులకనను, నయతిచ = పొందించుచున్నది.

తా. పార్వతీ, నీతండ్రి హిమవంతుఁడు తనయందలిబరువును వెడఁదతనమును నీ కరణముగానిచ్చెను. కనుకనే బరువై గొప్పతగు నీనితంబము ఈ సమస్తభూమిని కప్పి తేలికగాఁ జేయుచున్నది.

అవ. తొడలను మోఁకాళ్లను ఒక్కమాఱే వర్ణించుచున్నారు. -

కరీన్ద్రాణాం శుణ్డాన్ కనకకదళీకాణ్డపటలీ
ముభాభ్యామూరుభ్యాముభయమపి నిర్జిత్య భవతీ,
సువృత్తాభ్యాం పత్యుః ప్రణతికఠినాభ్యాం గిరిసుతే
విధిజ్ఞే జానుభ్యాం విబుధకరికుమ్భద్వయమసి. 82

టీ. విధిజ్ఞే = శాస్త్రార్థమునెఱింగిన, హేగిరిసుతే = ఓపార్వతీ, భవతీ = నీవు, కరీంద్రాణామ్ = ఏనుఁగులయొక్క, శుండాన్ = తుండములను, కనకకదళీకాణ్డపటలీం-కనకకదళీ = బంగా రరఁటిచెట్లయొక్క, కాణ్డ = స్తంభములయొక్క, పటలీం = సమూహమును, ఉభాభ్యాం = రెండగు, ఊరుభ్యాం = తొడలచేత, ఉభయమపి = రెంటిని, నిర్జిత్య = ఓడించి, సువృత్తాభ్యాం = చక్కనై వట్రువలైన, పత్యుః = భర్తయొక్క, ప్రణతికఠినాభ్యామ్-ప్రణతి = మ్రొక్కుటచేత, కఠినాభ్యాం = గట్టిపడిన, జానుభ్యాం = మోఁకాళ్ళచేత, విబుధకరికుంభద్వయమసి-విబుధకరి = దిగ్గజములయొక్క, కుమ్భ = కుంభములయొక్క, ద్వయమపి = రెంటిని, నిర్జిత్య = జయించి, అసి = ఉంటివి.

తా. తల్లీ, నీవు నీవట్రువలైనచక్కనితొడలచే నొక్కమాఱే ఏనుఁగు తుండములను అరఁటికంబములను జయించి విధిననుసరించి భర్తకు మ్రొక్కుటచే భూస్పర్శమున బిరుసువారినమోఁకాళ్లచేత ఏనుఁగుకుంభములనుగూడ