పుట:Saundarya-Lahari.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

సౌందర్యలహరి


తవ త్రాతుం భఙ్గాదలమితి వలగ్నం తనుభువా
త్రిథా నద్ధం దేవి త్రివళి లవలీవల్లిభిరివ. 80

టీ. హేదేవి = ఓపార్వతీ, సద్యః = ఎప్పటికప్పుడే, స్విద్యత్తటఘటితకూర్పాసభిదురౌ-స్విద్యత్ = (అనుక్షణము ఈశ్వరునిధ్యానించుటచేతఁ) జెమర్చిన, తట = ప్రక్కలయందు, ఘటిత = తొడగఁబడిన, కూర్పాస = రవికెను, భిదురా = పిగుల్చుచున్నవియు, దోర్మూలే = చంకలను, కషన్తౌ = ఒఱియుచున్న, కనకకలశాభౌ = బంగారుకుండలవంటి, కుచౌ = స్తనములను, కలయతః = నిర్మించుచున్న, తనుభువా = మన్మథునిచేత, (ఇట్టి మనోహరస్తనములను సృజించుటలో ముసలివాఁడును అరసికుఁడునుగనుక బ్రహ్మకు శక్తిచాలదు) భఙ్గాత్ = అపాయమువలన, త్రాతుం = కాపాడుకొఱకు, అలమితి = చాలునని, తవ = నీయొక్క, వలగ్నం = నడుము, త్రివళిలవళీవల్లిభిః-త్రివళి = మూఁడు ముడుతలనే, లవలీవల్లిభిః = ఒకదినుసుతెల్లనితీఁగలచేత, త్రిథా = మూఁడు పేటలుగా, నద్ధమివ =కట్టఁబడినదో యనునట్లున్నది.

తా. తల్లీ, తేపకుఁ జెంతలయందుఁజెమర్చిరవికనుబిగుల్చుచున్నవియు బాహుమూలములనొఱయుచున్నవియునగు బంగారుకుండలవంటి నీస్తనములను నిర్మించుమన్మథునిచేత ఈస్తనములబరువునకునడుమపాయ మొందకుండుటకై, తెల్లనితీఁగలతో మూఁడుకట్లు గట్టెనోయని యూహ వొడముచున్నది.

గురుత్వం విస్తారం క్షితిధరపతిః పార్వతి నిజా
న్నితమ్బాదాచ్ఛిద్య త్వయి హరణరూపేణ నిదధే,
అతస్తే విస్తీర్ణో గురు రయ మశేషాం వసుమతీం
నితమ్బప్రాగ్భారః స్థగయతి లఘుత్వం నయతి చ. 81

టీ. హేపార్వతి = ఓహిమవంతునికూఁతురా, క్షితిధరపతిః = నీతండ్రియగుహిమవంతుఁడు, గురుత్వం = భారమును, విస్తారం = వైశాల్యమును, నిజాత్ = తనదగు, నితమ్బాత్ = చఱియనుండి, అచ్ఛిద్య = తీసి, త్వయి = నీయందు, హరణరూపేణ = అరణమను నాకృతిచే, నిచధే = ఉంచెను, అతః = ఇందు