పుట:Saundarya-Lahari.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

61


హోమగుండము, రతేః = రతీదేవికి, లీలాగారం = విహారగృహము, గిరిశనయనానాం-గిరీశ = ఈశ్వరునియొక్క, నయనానాం = కనులయొక్క, సిద్ధేః = సిద్ధికి, గుహాద్వారమ్ = గుహాముఖము, కిమపి = ఏమనివర్ణించుటకు వీలుగానిదై, విజయతే = దెన్నుమీఱుచున్నది,

తా. తల్లీ, నీబొడ్డు కదలనిగంగసుడి, స్తనములనే పూ మొగ్గలకునాధారమైన రోమరాజి యగుతీఁగెకుపాదు, మదనాగ్నికి గుండము, రతికి విలాస గృహము, ఈశ్వరునినేత్రములసిద్ధికి గుహ, ఏమనివర్ణించుటకు నలవిగాదు.

నిసర్గక్షీణస్య స్తనతటభరేణ క్లమజుషో
నమన్మూర్తేర్నారీతిలక శనకైస్తృట్యత ఇవ
చిరం తే మధ్యస్య తృటితతటినీతీరతరుణా
సమావస్థాన్థేమ్నో భవతు కుశలం శైలతనయే. 79

టీ. నారీతిలక = స్త్రీరత్నమ, హేశైలతనయే = ఓపార్వతీ, నిసర్గక్షీణస్య-నిసర్గ = స్వభావముచేతనే, క్షీణస్య = కృశించినదియు, స్తనతటభరేణ-స్తనతట = కుచదేశముయొక్క, భరేణ = వ్రేఁగుచేత, క్లమజుషః = బడలినదియు, నమన్మూర్తేః-నమత్ = వంగిన, మూర్తేః = ఆకారముగలదియు, శనకైః = మెల్లగా, తృట్యతఇవ = తెగుచున్నదో యనునట్లున్నదియు, తృటితతటినీతీరతరుణా-తృటిత = ఒడ్డువిఱిగిన, తటినీ = ఏఱుయొక్క, తీర = దరియందలి, తరుణా = చెట్టుతోడ, సమానస్థాన్థేమ్నః-సమా = తుల్యమైన, అవస్థా =ఉనికియందు, న్థేమ్నః = నిలకడగల, తే = నీయొక్క, మధ్యస్య = నడుమునకు, చిరమ్ = కలకాలము, కుశలమ్ = క్షేమము, భవతు = అగుగాక.

తా. తల్లీ, స్వభావముననేకృశించినదియు, స్తనభారముచేసడలినదియు వంగినదియు, మెల్లగాఁదెగిపోవుచున్నట్లున్నదియు, తెగినయేటిగట్టుననున్న చెట్టువలె నూఁగుచున్న నీనడుమునకు కలకాలము శుభమగుగాక.

కుచౌ సద్యస్స్విద్యత్తటఘటితకూర్పాసభిదురౌ
కషన్తౌ దోర్మూలే కనకకలశాభౌ కలయతః,