పుట:Saundarya-Lahari.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

53


పాన = అధరోష్ఠము నొక్కుటయందు, ఆకులతయా = తడఁబడినవాఁడగుటచే, గిరీశేన = శివునిచేత, ముహుః = మాటిమాటికి, ఉదస్తం = పైకెత్తఁబడినదియు, శమ్భోః = శివునకు, కరగ్రాహ్యం = చేతఁబట్టుకోఁదగిన, ముఖముకురవృన్తం-ముఖ = ముఖమను, ముకుర = అద్దముయొక్క, వృన్తం = పిడియగు, ఔపమ్యరహితం = తులలేని, తవ = నీయొక్క, చుబుకం = గడ్డమును, కథంకారం = ఎట్లు, బ్రూమః = వర్ణింపఁగలము.

తా. తల్లీ, వాత్సల్యముచే నీతండ్రిచేఁ బుణుకఁబడినదియు, నధరపానమునఁ దడబాటుగల నీప్రియునిచేత మాటికి నెత్తఁబడినదియు, నీముఖదర్పణమును చూచుకొనుటయం దీశ్వరునికి నద్దపుఁబిడిగానైన యీడులేని నీగడ్డమును దేనితోఁబోల్చి వర్ణింతుము. దానికీడైనవస్తువే లోకమున లేదు.

భుజాశ్లేషాన్నిత్యం పురదమయితుః కణ్టకవతీ
తవ గ్రీవా ధత్తే ముఖకమలనాళశ్రియమియమ్,
స్వతశ్శ్వేతా కాలాగరుబహుళజమ్బాలమలినా
మృణాళీలాలిత్యం వహతి యదధో హారలతికా. 68

టీ. హేభగవతి = ఓదేవీ, పురదమయితుః = ఈశ్వరునియొక్క, భుజాశ్లేషాత్-భుజ = బాహువులచేతనైన, అశ్లేషాత్ = కౌఁగిలింతవలన, నిత్యం = ఎల్లపుడును, కణ్టకవతీ = గగుర్పాటుగల, తవ = నీయొక్క, ఇయం = ఈ, గ్రీవా = మెడ, ముఖకమలనాళశ్రియమ్-ముఖ = ముఖమనెడు, కమల = కమలముయొక్క, నాళ = కాఁడయొక్క, శ్రియమ్ = సొబగును, ధత్తే = తాల్చుచున్నది, యత్ = ఏకారణమువలన, అధః = దానిక్రింద, స్వతః = స్వభావముననే, శ్వేతా = తెల్లనైనదియు, కాలాగరుబహుళజమ్బాలమలినా-కాలాగరు = కృష్ణాగరువనే, బహుళ = విస్తారమైన, జమ్బాల = బురదచేత, మలినా = మాసిన, హారలతికా = తీఁగవంటిహారము, మృణాళీలాలిత్యమ్-మృణాళీ = తామరతీఁగయొక్క, లాలిత్యమ్ = అందమును, వహతి = భరించుచున్నదో.

తా. తల్లీ! శివుని కౌఁగిలింతలచే గగుర్పాటునొందిన నీ మెడ ముఖమను తామరపూవుయొక్క కాఁడవలెనున్నది. యెందువలన దానిక్రింద