పుట:Saundarya-Lahari.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

సౌందర్యలహరి


విపఞ్చ్యా గాయన్తీ వివిధమపదానం పశుపతే
స్త్వయారబ్థే వక్తుం చలితశిరసా సాధువచనే,
త్వదీయైర్మాధుర్యైరపలపితతన్త్రీకలరవాం
నిజాం వీణాం వాణీ నిచుళయతి చోళేన నిభృతమ్. 66

టీ. హేభగవతి = ఓపార్వతీ, వాణీ = సరస్వతీదేవి, పశుపతేః = ఈశ్వరునియొక్క, వివిధం = పలువిధములుగల, అపదానం = త్రిపురవిజయము మొదలగు పూర్వచరితములను, విపఞ్చ్యా = వీణచేత, గాయన్తీ = పాడుచున్నదై, చలితశిరసా-చలిత = ఆనందముచే నూఁచఁబడిన, శిరసా = ఔదలగలది, త్వయా = నీచేత, సాధువచనే = ప్రశంసావాక్యము, వక్తుం = పలుకుటకొఱకు, అరబ్థేసతి = మొదలిడఁబడుచుండఁగా, త్వదీయైః = నీవాక్కులయందుగల, మాధుర్యైః = మధురగుణములచేత, అపలపితతన్త్రీకలరవా-అపలపిత = పరిహసింపఁబడిన, తన్త్రీ = వీణతీఁగెలయొక్క, కలరవా = అవ్యక్త మధురశబ్దములు గల, నిజాం = తనదగు, వీణాణ్ = వీణను, చోళేన = గవిసెనచేత, నిభృతం = గూఢముగా, నిచుళయతి = కప్పుచున్నది.

తా. తల్లీ, సరస్వతీదేవి వీణ శ్రుతి జేసి నీయెదుట యీశ్వరునిచరితములఁ బాడుచుండి నీవు వాని కలరి శిరఃకంపముఁజేయుచు ప్రశంసావచనముల ననఁబోవుచుండఁగానే నీవాఙ్మాధుర్యముచేఁ దిరస్కరింపఁబడిన వీణాధ్వని గలదై తనవీణెకు గవిసెనను దొడుగుచున్నది.

కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా
గిరీశేనోదస్తం ముహురధరపానాకులతయా,
కరగ్రాహ్యం శమ్భోర్ముఖముకురవృన్తం గిరిసుతే
కథంకారం బ్రూమస్తవ చుబుకమౌపమ్యరహితమ్. 67

టీ. హేగిరిసుతే = ఓపార్వతీ, వత్సలతయా = పుత్రీప్రేమగలవాఁడుగుటచేత, తుహినగిరిణా = మంచుకొండచేత, కరాగ్రేణ-కర = చేతియొక్క, అగ్రేణ = కొసచేత, స్పృష్టం = పుణుకఁబడినదియు, అధరపానాకులతయా - అధర