పుట:Saundarya-Lahari.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

43

తా. శివుని పట్టపురాణివగునోతల్లీ, ఈనీమూఁడుకనులు కాటుకబెట్టఁబడినవి గనుక వేఱుగా నగపడు తెలుపు నలుపు ఎఱుపు రంగుగలిగి మహాప్రళయమందు పరమాత్మయందు లీనులైన బ్రహ్మవిష్ణురుద్రులను తిరిగి పుట్టించుటకొఱకు ధరింపఁబడిన సత్వరజస్తమోగుణములా యనునట్లు ప్రకాశించుచున్నవి.

అవ. దీనినే మఱల నుత్ప్రేక్షించుచున్నాఁడు -

పవిత్రీకర్తుం నః పశుపతిపరాధీనహృదయే
దయామిత్రైర్నేత్రైరరుణధవళశ్యామరుచిభిః,
నదశ్శోణో గఙ్గా తవనతనయేతి ధ్రువమయం
త్రయాణాం తీర్థానాముపనయసి సమ్భేదమనఘమ్ 54

టీ. హేపశుపతిపరాధీనహృదయే = సదాశివలగ్నహృదయముగల యోతల్లీ, దయామిత్రైః = దయతోఁగూడిన, అరుణధవళశ్యామరుచిభిః = ఎఱ్ఱని తెల్లని నల్లనికాంతులుగల, నేత్రైః = కనులచే, శోణఃనదః = ఎఱ్ఱనిశోణనదియు, గఙ్గా = తెల్లనిభాగీరథియు, తపనతనయా = నల్లనియమునయు, ఇతి = ఈలాగున, త్రయాణామ్ = మూఁడగు, తీర్థానామ్ = తీర్థములయొక్క, అనఘమ్ = పాపహరమైన, సమ్భేదమ్ = సంగమమును, నః = మమ్ము, పవిత్రీకర్తుమ్ = పునీతులఁజేయుటకొఱకు, ఉపనయసి = తెచ్చుచున్నావు, ధ్రువమ్ = నిజము.

తా. శివాసక్తచిత్తయగు నోతల్లీ, దయామయములై ఎఱుపు తెలుపు నలుపురంగులు గల కనులతో పాపాత్ములగు మమ్ము పావనముజేయుటకొఱకు శోణ గంగ యమున యను మూఁడునదులయొక్క పుణ్యమగు సంగమమును తెచ్చెదవు. ఇది నిజము.

నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతీ
తవేత్యాహుస్సన్తో ధరణిధర రాజన్యతనయే,
త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః
పరిత్రాతుం శఙ్కే పరిహృతినిమేషాస్తవ దృశః. 55