పుట:Saundarya-Lahari.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

35

టీ. హేశివే = ఓపార్వతీ, తులితదళితేన్దీవరవనమ్-తులిత = పోల్చఁబడిన, దళిత = వికసించిన, ఇందీవరవనమ్ = నల్లకలువలతోఁటగల, ఘనస్నిగ్ధశ్లక్ష్ణమ్-ఘన = చిక్కనైన, స్నిగ్ధ = మెఱుఁగైన, శ్లక్ష్ణమ్ = మృదుల (సుకుమార) మైన, తవ = నీయొక్క, చికురనికురుమ్బమ్ = కేశకలాపము, నః = మాయొక్క, ధ్వాన్తమ్ = మూలాజ్ఞానమును, ధునోతు = పోఁగొట్టుఁగాక, యదీయమ్ = ఏకురులదగు, సహజమ్ = స్వాభావికమగు, సౌరభ్యమ్ = సువాసనను, ఉపలబ్ధుమ్ = పొందుటకొఱకు, ఆస్మిన్ = ఈకేశకలాపమందు, వలమథనవాటీవిటపినామ్-వలమథన = ఇంద్రునియొక్క, వాటీ = నందనోద్యానమందలి, విటపినామ్ = కల్పవృక్షములయొక్క, సుమనసః = పూవులు, వసన్తి = ఉన్నవో, ఇతి = ఈలాగున, మన్యే = తలంచెదను. ఉత్ప్రేక్ష.

తా. తల్లీ, నల్లకలువలఁబోలి చిక్కవై మెఱుఁగై నునుపుగల నీకురుల కొప్పు మాయజ్ఞానమును బోఁగొట్టుఁగాక. నందనవనమందలి కల్పవృక్షకుసుమములు నైజమైన నీకురుల పరిమళమునుబొందుటకై యెల్లపుడును ఏనీకేశముల నాశ్రయించుచున్నవో (కల్పవృక్షపుష్పములచే నలంకరింపఁబడినవనుట).

తనోతు క్షేమం నస్తవ వదనసౌన్దర్యలహరీ
పరీవాహ స్రోతస్సరణిరివ సీమన్తసరణిః,
వహన్తీ సిన్దూరం ప్రబలకబరీభారతిమిర
ద్విషాం బృన్దైర్బన్దీకృతమివ నవీనార్కకిరణమ్. 44

టీ. హేభగవతి = ఓయమ్మా, తవ = నీయొక్క, వదనసౌన్దర్యలహరీపరీవాహస్రోతస్సరణిరివ-వదన = ముఖముయొక్క, సౌన్దర్య = అందముయొక్క, లహరీ = ప్రవాహముయొక్క, పరీవాహ = కలుఁజుయొక్క, స్రోతః = జాలుయొక్క, సరణిరివ = త్రోవవలెనున్న, సీమన్తసరణిః = పాపటత్రోవ, ప్రబలకబరీభారతిమిరద్విషామ్-ప్రబల = బలవంతులైన, కబరీభార = కేశపాశము (పాయలు) ల సమూహములనే, తిమిర = చీఁకటులనే, ద్విషామ్ = వైరులయొక్క, బృన్దైః = పదువులచేత, బన్దీకృతమ్ = చెఱఁబెట్టఁబడిన, నవీనార్కకిరణమివ-నవీన = లేఁతవాఁడగు, అర్క = సూర్యునియొక్క, కిరణమివ = అంశువువలెనున్న,