పుట:Saundarya-Lahari.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

సౌందర్యలహరి


దృగ్గోచరముకాని, ఆలోకే = విజనమగు, భాలోకభువనే = వెన్నెలగల లోకమందు (సహస్రారమున), నిపసతిహి = ఉండునో.

తా. తల్లీ, సూర్యచంద్రులకోటుల గ్రేణిసేయఁజాలు పరాకారజ్ఞానసంపన్నుఁడైన నీకు నిలయమగు నాజ్ఞాచక్రమందున్న పరమశివునకు మ్రొక్కెదను. ఏదేవుని భక్తితోఁ బూజించువాఁడు, సూర్యచంద్రాగ్నులకు నగోచరమగు దృగ్గోచరముగాని యేకాంతమగు జ్యోత్స్నాప్రచురమగు లోకమందు వసించియుండునో.

విశుద్ధౌ తే శుద్ధస్ఫటికవిశదం వ్యోమజనకం
శివం సేవే దేవీమపి శివసమానవ్యవసితామ్,
యయోః కాన్త్యా యాన్త్యాశ్శశికిరణసారూప్యసరణే
ర్విధూతా న్తర్ధ్వాన్తా విలసతి చకోరీవ జగతీ. 37

టీ. హేభగవతి = ఓతల్లీ, తే = నీయొక్క, విశుద్ధౌ = విశుద్ధచక్రమందు, శుద్ధస్ఫటికవిశదం-శుద్ధ = మలినములేని, స్ఫటిక = స్ఫటికమణివలె, విశదం = శుభ్రమైన, వ్యోమజనకం-వ్యోమ = ఆకాశతత్వమునకు, జనకం = ఉత్పాదకమగు, (అనఁగా ఆజ్ఞాచక్రమందు ఆత్మతత్వమున్నట్లు చెప్పఁబడినది. దానివలన నాకాశతత్వ ముదయించుననుట.) శివం = శివతత్వమును, శివసమానవ్యవసితాం-శివ = శివునితో, సమాన = తుల్యమగు, వ్యవసితాం = ప్రయత్నముగల, దేవీమపి = దేవీతత్వమును, నీవే = పరిచరించెదను, యయోః = ఏశివాశివులయొక్క, యాన్త్యాః = వెలుఁగుచున్న, శశికిరణసారూప్యసరణేః-శశికిరణ = చంద్రకాంతులయొక్క, సారూప్య = పోలికయొక్క, సరణేః = సరిపాటిగల, కాన్త్యాః = కాంతివలన, జగతీ = లోకము, విధూతాన్తర్ధ్వాన్తా-విధూత = పోకార్చఁబడిన, అన్తర్ధ్వాన్తా = అజ్ఞానముగలదై, చకోరీవ = వెన్నెలపులుఁగువలె, విలసతి = ప్రకాశించుచున్నదో.

తా. తల్లీ, నీవిశుద్ధచక్రమందు స్ఫటికమణివలె నిర్మలమైన ఆకాశజనకమగు శివతత్వమును అట్టిదయగు దేవీతత్వమును సేవించెదను. వెలుఁగుచున్న