పుట:Saundarya-Lahari.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

29


మరుత్సారథిః = స్వాధిష్ఠానమందలి యగ్నితత్వము, అసి = అయితివి, త్వం = నీవు, అపః = మణిపూరమందలి జలతత్వము, అసి = అయితివి, త్వం = నీవు, భూమిః = మూలాధారమందలి పృథివీతత్త్వము, అసి = అయితివి, త్వయి = నీవు, పరిణతాయాం = తాదాత్మ్యమును బొందినదానవగుచుండఁగా, పరం = ఇంతకన్న వేఱయినది, నహి = లేదు, త్వమేవ = నీవే, స్వాత్మానం = నీస్వరూపమును, విశ్వవపుషా = జగదాకారముతోడ, పరిణమయితుం = తాదాత్మ్యమును పొందించుటకు, హేశివయువతి = ఓయీశ్వరి, భావేన = చిత్తముతో, చిదానందాకారం = చిచ్ఛక్తియొక్కయు ఆనందభైరవునియొక్కయు రూపమును, బిభృషే = భరించెదవు.

తా. తల్లీ, షట్చక్రములయందున్న పృథివ్యాదితత్వములునీవే, నీవు ప్రపంచమున వ్యాపించియుండఁగా వేఱొకటిలేదు. నీవే నీరూపమును ప్రపంచముతోఁ జేర్చి యొక్కటిగాఁ జేయుటకొఱకు చిచ్ఛక్తియొక్కయు, ఆనందభైరవునియొక్కయు, రూపమును చిత్తమున ధ్యానించెదవు.

తవాజ్ఞాచక్రస్థం తపనశశికోటిద్యుతిధరం
పరం శమ్భుం వన్దే పరిమిళితపార్శ్వం పరచితా,
యమారాధ్యన్భక్త్యా రవిశశిశుచీనామవిషయే
నిరాలోకే౽లోకే నివసతి హి భాలోకభువనే. 36

టీ. హేభగవతి = ఓతల్లీ, తవ = నీయొక్క, (తవ యనుటచే సాధకుని భ్రూమధ్యగతమగు చక్రచతుష్టయము పేర్కొనఁబడును), ఆజ్ఞాచక్రస్థమ్ = ఆజ్ఞాచక్రమందున్న, తపనశశికోటిద్యుతిధరం-తపనశశి = సూర్యచంద్రులయొక్క, కోటి = అనేకకోటులయొక్క, ద్యుతి = కాంతివంటికాంతిని, ధరం = ధరించిన, పరచితా = పరాకారజ్ఞానముచేత, పరిమిళితపార్శ్వం-పరిమిళిత = ఆవరింపఁబడిన, పార్శ్వం = ఇరుప్రక్కలుగల, పరం = పరుఁడగు, శమ్భుం = శివునిగూర్చి, వన్దే = నమస్కరించెదను, యం = ఏదేవుని, భక్త్యా = పూజ్యానురాగముతోడ, ఆరాధ్యన్ = పూజించువాఁడు, రవిశశిశుచీనాం = సూర్యచంద్రాగ్నులకును, ఆవిషయే = గోచరముకానిది గనుకనే, నిరాలోకే =