పుట:Saundarya-Lahari.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

సౌందర్యలహరి


అతశ్శేషశ్శేషీత్యయముభయసాధారణతయా
స్థితస్సమ్బన్ధో వాం సమరసపరానన్దపరయోః. 34

టీ. హేభగవతి = ఓతల్లీ, (పుట్టుట, చచ్చుట, వచ్చుట, పోవుట, విద్య, అవిద్య వీని నెఱిఁగియుండుట భగము, ఇది గలదిగనుక భగవతి) శమ్భోః = (ఆనందభైరవుఁడగు) ఈశ్వరునకు, త్వం = నీవు (మహాభైరవి), శశిమిహిరవక్షోరుహయుగమ్ = సూర్యచంద్రులే స్తనములుగాఁగల, శరీరం = మేనుగా, (భవసి = అగుదువు,) తవ = నీయొక్క, ఆత్మానం = స్వరూపమును, అనఘం = పాపములేని, నవాత్మానం = నవవ్యూహాత్మకమైన యానందభైరవాకృతినిగా, మన్యే = తలఁచెదను, అతః = ఇందువలన, శేషః = అప్రధానము, శేషీ = ప్రధానము, ఇతి = ఇట్టి, అయమ్ = ఈ, సమ్బన్ధః = శేషశేషిభావరూప సంబంధము, సమరసపరానన్దపరయోః-సమరస = సామరస్యముతోఁగూడిన, పరానన్ద = ఆనందభైరవుఁడు (ఆనందభైరవి) యనుసమానాకారములు, పరయోః = ప్రధానములుగాఁగల, వాం = మీయిరువురకు, ఉభయసాధారణతయా = ఇద్దఱకుఁ జెల్లునదిగా, స్థితః = ఉన్నది.

తా. తల్లీ, సూర్యచంద్రులు స్తనములు గాఁగల నీవు (ఆనందభైరవీరూపచిచ్భక్తికళ) ఆనందభైరవునకు నొడలుగాఁ గనుపట్టుదువు, ఆయానందభైరవునిరూపము నీరూపముగాఁ దోఁచును, ఇందువలన విచారింపఁగా శేషశేషిభావరూపసంబంధము మీయిద్దఱకు సమానమని తోఁచెడివి.

మనస్త్వం వ్యోమ త్వం మరుదసి మరుత్సారథిరసి
త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం న హి పరం,
త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా
చిదానన్దాకారం శివయువతి భావేన బిభృషే. 35

టీ. హేభగవతి = దేవీ, త్వం = నీవు, మనః = ఆజ్ఞాచక్రమందలి మనస్తత్వము, అసి = అయితివి, వ్యోమ = విశుద్ధచక్రమందలియాకాశతత్వము, అసి = అయితివి, మరుత్ = అనాహతమందలి వాయుతత్వము, అసి = అయితివి,