పుట:Saundarya-Lahari.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

23

టీ. హేభగవతి = ఓతల్లీ, ఆత్మార్పణదృశా = బ్రహ్మార్పణబుద్ధిచేత, జల్పః = నోటికొలఁదివాఁగుట, జపః = మంత్రజపము, సకలమపి = అంతయు, శిల్పం = చిత్రలేఖనము మున్నగుచేతిపనియు, ముద్రావిరచనా-ముద్రా = సంక్షోభణవిద్రావణాదిముద్రలయొక్క, విరచనా = చేయుటయు, గతిః = స్వేచ్ఛగాఁ దిరుగుటయు, ప్రాదక్షిణ్యక్రమణం = ప్రదక్షిణము దిరుగుట, అశనాది = ఏదేని తినుట మొదలైనదియు, ఆహుతివిధిః = ఇష్టదైవమునుగూర్చి హవిస్సు నర్పించుటయు, ప్రణామః = మ్రొక్కుటయు, సంవేశః = క్రిందఁబడి దొర్లుటయు, సుఖం = శబ్ధస్పర్శాదికమగు సుఖమున్ను, అఖిలం = ఈచెప్పిన వానికంటె వేఱైన (ఒడలువిఱుచుట, కనులుమూయుట మొదలగు) సమస్తకార్యమును, ఆత్మార్పణదృశా = బ్రహ్మార్పణబుద్ధిచేత, తవ = నీకు, సపర్యాపర్యాయః = పూజకు మాఱుగా, భవన్తు = అగుఁగాక.

తా. తల్లీ, మనోవాక్కాయములచేత బ్రహ్మార్పణబుద్ధితో నేఁజేయు నెల్లపనులును నీకు పూజలేయగుఁగాక.

సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం
విపద్యన్తే విశ్వే విధిశతమఖాద్యా దివిషదః,
కరాళం యత్క్ష్వేళం కబళితవతః కాలకలనా
న శమ్భోస్తన్మూలం తవ జనని తాటఙ్కమహిమా. 28

టీ. హేజనని = ఓతల్లీ, విశ్వే = ఎల్ల రగు, విధిశతమఖాద్యాః = బ్రహ్మేంద్రాదులైన, దివిషదః = స్వర్గవాసులైనదేవతలు, ప్రతిభయజరామృత్యుహరిణీమ్-ప్రతిభయ = భయంకరములైన, జరా = ముదిమిని, మృత్యు = చావును, హరిణీం = పోఁగొట్టునట్టి, సుధాం = అమృతమును, ఆస్వాద్యాసి = త్రాగియు, విపదన్తే = మరణించుచున్నారు, కరాళం = భయంకరమగు, క్ష్వేళం = విషమును, కబళితవతః = మ్రింగిన, శంభోః =ఈశ్వరునకు, కాలకలనా = నాశము, నాస్తీతియత్ = లేదనుట యేదికలదో, తన్మూలం = దానికికారణము, తవ = నీయొక్క, తాటఙ్కమహిమా-తాటఙ్క = కమ్మలయొక్క, మహిమా = సామర్థ్యము.