పుట:Saundarya-Lahari.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

19

టీ. భగవతి = తల్లీ, తటిల్లేఖాతన్వీం-తటిల్లేఖా = మెఱుపుతీఁగవలె, తన్వీం = సూక్ష్మమై దీర్ఘమై క్షణవిలసనముగలదియు, తపనశశివైశ్వానరమయీం = సూర్యచంద్రాగ్నిరూపముగలదియు, షణ్ణాం = ఆఱగు, కమలానాం = చక్రములయొక్క, ఉపరి = మీఁద, మహాపద్మాటవ్యాం = గొప్పతామరతోఁటయందు (సహస్రారమందు), నిషణ్ణాం = కూర్చున్న, తవ = నీయొక్క, కలాం = సాదాఖ్యకళను, మృదితమలమాయేన - మృదిత = పోకార్చఁబడిన, మలమాయేన = కామాదిమలములు - అవిద్యాస్మితాహంకారాదులుగల, మనసా = మనస్సుతో, పశ్యన్తః = చూచుచున్న, మహాన్తః = సజ్జనులు, పరమానన్దలహరీం = ఉత్తమమైన యానంద్రప్రవాహమును, దధతి = పొందుచున్నారు.

తా. తల్లీ, షట్పద్మములమీఁద సహస్రారమందున్న సూర్యచంద్రాగ్నిరూపమైన మెఱుపుతీగెవంటిదగు నీకళను కామాదిమలములు మాయ వీనిచే విడువఁబడినచిత్తముతో ధ్యానింతురేని వారు మహదానందప్రవాహమున నోలలాడుదురు.

భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా
మితి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః,
తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్యపదవీం
ముకున్దబ్రహ్మేంద్రస్ఫుటమకుటనీరాజితపదామ్. 22

టీ. భవాని = ఈశ్వరీ, త్వం = నీవు, దాసే = కింకరుఁడనగు, మయి = నాయందు, సకరుణాం = దయతోఁగూడిన, దృష్టిం = చూపును, వితర = ఇమ్ము, ఇతి = ఇట్లు, యః = ఎవఁడు, స్తోతుం = పొగడుటకొఱకు, వాంఛన్ = ఇచ్చగించువాఁడై, భవానిత్వమితి = భవానిత్వం అని, కథయతి = నుడువునో, తస్మై = వానికొఱకు, త్వం = నీవు, తదైవ = అప్పుడే (మాటముగియకముందే), ముకున్దబ్రహ్మేన్ద్రమకుటనీరాజితపదాం-ముకున్ద = విష్ణువుయొక్కయు, బ్రహ్మ = బ్రహ్మయొక్కయు, ఇంద్ర = ఇంద్రునియొక్కయు, స్ఫుట = వెలుఁగుచున్న, మకుట = కిరీటములచేత, నీరాజిత = ఆర తెత్తబడిన, పదాం = అడుగులు