పుట:Saundarya-Lahari.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

సౌందర్యలహరి


శ్లో. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభఙ్గరుచిభి
    ర్వశిన్యాద్యాభిస్త్వాం సహ జనని సఞ్చిన్తయతి యః,
    సకర్తా కావ్యానాం భవతి మహతాం భఙ్గిరుచిభి
    ర్వచోభిర్వాగ్దేవీవదనకమలామోదమధురైః. 17

టీ. హేజనని = ఓతల్లీ, వాచాం = పలుకులకు, సవిత్రీభిః = జనకములై శశిమణిశిలాఙ్గరుచిభిః-శశిమణిశిలా = చంద్రకాంతపుఱాలయొక్క, భఙ్గ = ముక్కలయొక్క, రుచిభిః = కాంతివంటికాంతిగల, పశిన్యాద్యాభిస్సహ = పశిని మొదలగుశక్తులతోఁగూడ, త్వాం = నిన్ను, యః = ఎవఁడు సఞ్చిన్తయతి = చక్కగా ధ్యానించునో, సః = వాఁడు, మహతాం = వాల్మీకిమున్నగుమహా కవులయొక్క, భఙ్గిరుచిభిః-భఙ్గి = రచనలయొక్క, రుచిభిః = చవులుగలిగినవియు, వాగ్దేవీవదనకమలామోదమధురైః-వాగ్దేవీ = సరస్వతియొక్క, వదనకమల = కమలమువంటి ముఖమందలి, ఆమోద = మరిమళముచేత, మధురైః = తీపులైన, వచోభిః = సుభాషితములచేత, కావ్యానాం = కబ్బములకు, కర్తా = చేయువాఁడుగా, భవతి = అగుచున్నాఁడు.

తా. తల్లీ, నిన్ను కవిత్వమునిచ్చునట్టి వశిన్యాదిశక్తులతోఁగూడ ధ్యానముచేయువాఁడు వ్యాసవాల్మీకి ప్రభృతులకవనమువలె మధురమై శ్రవణరమణీయమైన వాక్కులుగలిగి పురుషరూపముదాల్చినవాణియో యనునట్లు రసవత్కావ్యములకుఁ గర్త యగును.

శ్లో. తనుచ్ఛాయాభిస్తే తరుణతరణిశ్రీసరణిభి
    ర్దివం సర్వాముర్వీమరుణిమనిమగ్నాం స్మరతి యః,
    భవన్త్యస్యత్రస్యద్వనహరిణశాలీననయనా
    స్సహోర్వశ్యా వశ్యాః కతికతి న గీర్వాణగణికాః. 18

టీ. హేభగవతి = ఓతల్లీ, తరుణతరణిశ్రీసరణిభిః-తరుణ = లేఁతవాఁడగు, తరణి = సూర్యునియొక్క, శ్రీసరణిభిః = సౌభాగ్యమునుబోలుసౌభాగ్యముగల, తే = నీయొక్క, తనుచ్ఛాయాభిః = శరీరకాంతులచేత, దివం = ఆకాశమును, సర్వాం