పుట:Saundarya-Lahari.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

సౌందర్యలహరి


ఆకాశతత్వయుతమైనవిశుదచక్రమందు, ద్విఃషట్త్రింశత్ = డెబ్బదిరెండును, మనసిచ = మనస్తత్వయుతమగునాజ్ఞాచక్రమందు, చతుష్షష్టిః = అఱువదినాలుగును, ఇతి = ఈలాగున, యే = ఏ, మయూఖాః = జ్వాలలు (కలవో), తేషామపి = వానికంటె, ఉపరి = మీఁద (సహస్రదళకమలమందలి చంద్రబింబమువంటిదగు బైందవమను పేరఁబరఁగునమృతసముద్రమునందు), తవ = నీయొక్క, పాదామ్బుజయుగమ్-పాదామ్బుజ = పాదకమలములయొక్క, యుగమ్ = జంట, వర్తతే = ఉండును.

తా. తల్లీ, నీపాదములజంట భూ, జ, లాగ్ని, వా, య్వాకాశ, మనస్తత్వాత్మకము లగు మూలాధార, మణిపూరక, స్వాధిష్ఠా, నానాహత, విశుద్ధాజ్ఞాచక్రములయందున్న యోగిగమ్యములైన తేజస్సులకంటె పై సహస్రారమందు చంద్రబింబమువలె నుండు బైందవమను నమృతసముద్రమున నుండునని తా.

శ్లో. శరజ్జ్యోత్స్నాశుద్ధాం శశియుతజటాజూటమకుటాం
    వరత్రాసత్రాణస్ఫటికఘుటికాపుస్తకకరామ్,
    సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిదధతే
    మధుక్షీరద్రాక్షామధురిమధురీణాః ఫణితయః. 15

టీ. హేభగవతి = తల్లీ, శరజ్జ్యోత్స్నాశుద్ధామ్-శరత్ = శరత్కాలమందలి, జ్యోత్స్నా = వెన్నెలవలె, శుద్ధాం = నిర్మలమైనదియు, శశియుతజటాజూటమకుటాం-శశి = చంద్రునితోడ, యుత = కూడుకొనిన, జటాజూట = కేశకలాపమే, మకుటాం = శిరోభూషణముగాఁగలదియు, వరత్రాసత్రాణస్ఫటికఘుటికాపుస్తకకరాం-వర వరదానముద్రయు, త్రాసత్రాణ = అభయముద్రయు, స్ఫటికఘుటికా = స్ఫటికములచే నిర్మింపఁబడిన జపమాలయు, పుస్తక = పుస్తకమున్ను, కరాం = హస్తమునఁగల, త్వా = నిన్నుగూర్చి, సకృత్ =ఒక్కమాఱేని, నత్వా = నమస్కరించి, సతాం = సజ్జనులకు, మధుక్షీరద్రాక్షామధురిమధురీణాః-మధు = తేనెయొక్కయు, క్షీర = పాలయొక్కయు, ద్రాక్షా = ద్రాక్షపండ్లయొక్కయు,