పుట:Saundarya-Lahari.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

13



గళద్వేణీబన్ధాః కుచకలశవిస్రస్తసిచయా
హఠాత్త్రుట్యత్కాఞ్చ్యో విగిళితదుకూలా యువతయః. 13

టీ. హేభగవతి = ఓతల్లీ, వర్షీయాంసమ్ = ముదిసినవాఁడైనను, నయనవిరసం-నయన = కన్నులచేత, విరసమ్ = వికారరూపుఁడైనను, నర్మసు = రతిక్రీడలయందు, జడమ్ = మోటువాఁడైనను, తవ = నీయొక్క, అపాఙ్గాలోకే = క్రేగంటిచూపుయందు, పతితమ్ = పడిన, నరమ్ = మనుష్యమాత్రుని, యువతయః = జవ్వనులు, గళద్వేణీబన్థాః-గళత్ = జాఱుచున్న, వేణీ = జడలయొక్క, బన్థాః = ముళ్లుగలవారై, కుచకలశవిప్రస్తసిచయాః-కుచకలశ = కుండలవంటిచనులయందు, విస్రస్త = జాఱిపోయిన, సిచయాః = పైఁటకొంగులుగలవారై, హఠాత్ = ఆకస్మికముగా, త్రుట్యత్కాఞ్చ్యః-త్రుట్యత్ = తెగిన, కాఞ్చ్యః = మొలనూళ్లుగలవారై, విగళితదుకూలాః-విగళిత = వీడిపోయిన, దుకూలాః = పోకముడిగలవారై, అనుధావన్తి = వెంబడించి పరుగులిడుదురు.

తా. తల్లీ, నీచల్లనిచూడ్కులకు పాల్పడినవాఁ డెట్టిమోటువాఁడైనను, యెంతముసలివాఁడైనను, ఎంతవిరూపియైనను వానినే మన్మథుఁడని తలంచి వలచి విలాసవతులు తమకొప్పులు వీడంగా, పైఁట జాఱఁగా, మొలనూళ్లు తెగఁగా, కోకలు వీడఁగా వెంబడించి పరుగులిడుదురు.

శ్లో. క్షితౌ షట్పఞ్చాశద్ద్విసమధికపఞ్చాశుదుదకే
    హుతాశేద్వాషష్టిశ్చతురధికపఞ్చాశదనిలే,
    దివి ద్విష్షట్త్రింశన్మనసి చ చతుష్షష్టిరితి యే
    మయూఖాస్తేషామప్యుపరి తవ పాదామ్బుజయుగమ్. 14

టీ. హేభగవతి = ఓతల్లీ, క్షితౌ = పృథివీతత్వముతోఁగలసినమూలాధారమందు, షట్పఞ్చాశత్ = ఏఁబదియాఱును, ఉదకే = అప్తత్వముతోఁగూడిన మణిపూరమందు, ద్విసమధికపఞ్చాశత్ = ఏఁబదిరెండును, హుతాశే = అగ్నితత్వయుక్తమైన స్వాధిష్ఠానమున, ద్వాషష్టీః = అఱువదిరెండును, అనిలే = వాయుతత్వయుతమగు అనాహతచక్రమందు, తతురధికపఞ్చాశత్ = ఏఁబదినాలుగును, దివి =