పుట:Saundarya-Lahari.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

11


ఆమ్నాయ = అతిశయరూపమైన, మహసః = కాంతిగల చంద్రునివలన, స్వాం = స్వకీయమైన, భూమిం = మూలాధారచక్రమును, పునః = మఱల, అవాప్య = పొంది, భుజగనిభమ్-భుజగ = పాముతోటి, నిభమ్ = సమానమగు, అధ్యుష్ఠవలయమ్-అధ్యుష్ఠ = అధిష్ఠింపఁబడిన, వలయమ్ = కుండలిగలిగిన, స్వమ్ = తనదగు, ఆత్మానం = రూపమును, కృత్వా = చేసి (ధరించి), కుహరిణి = తామరబొడ్డుయందలిబెజ్జమువంటి బెజ్జముగల, కులకుణ్దే-కుల = పృథివీతత్వము లయమునొందు సుషుమ్నామూలమందలి, కుండే = కమలకందరూపమైనయాధారచక్రమందు, స్వపిషి = నిద్రింతువు.

తా. తల్లీ, నీవు పాదములవలనఁబుట్టిన యమృతవర్షముచే నాడీసమూహమును దడిపి చంద్రునివలన మఱల స్వస్థానమునుబొంది పామువలెచుట్టుకొనియున్న నిజరూపము మాని సూక్ష్మరంధ్రముగలిగిన సుషుమ్నామూలమందలి యాధారచక్రమందు నిదురించెదవు. ఆధారకుండమునడుమనున్న రంధ్రమున తామరదారపుపాటి యాకృతిగల కుండలినీశక్తి యుండునని భావము.

శ్లో. చతుర్భిశ్శ్రీకణ్ఠై శ్శివయువతిభిః పఞ్చభిరపి
    ప్రభిన్నాభిశ్శమ్భోర్నవభిరపి మూలప్రకృతిభిః,
    చతుశ్చత్వారింశద్వసుదళకళాశ్రత్రివలయ
    త్రిరేఖాభిస్సార్ధం తవ శరణకోణాః పరిణతాః. 11

టీ. హేభగవతి = ఓతల్లీ, చతుర్భిః = నలువురగు శ్రీకంఠైః = శివునిచేతను, శంభోః = ఈశ్వరునికంటె, ప్రభిన్నాభిః = వేఱైన, పంచభిరపి = ఏవురగు, శివయువతిభిః = శివశక్తులచేతను, నవభిరపి = తొమ్మిదగు, మూలప్రకృతిభిః = మూలకారణముచేతను, తవ = నీయొక్క, శరణకోణాః-శరణ = నిలయమగుశ్రీచక్రముయొక్క, కోణాః = కోణములు, వసుదళకళాశ్రత్రివలయత్రిరేఖాభిస్సార్థమ్ - వసుదళ = అష్టదళములచేతను, కళాశ్ర = షోడశదళములచేతను, త్రివలయ = త్రిమేఖలలచేతను, త్రిరేఖాభిస్సార్థమ్ = త్రిభూపురములచేతను, పరిణతాస్సంతః = పరిణామమునుబొందినవై, చతుశ్చత్వారింశత్ = నలువదినాలుగుగా నగుచున్నవి.