పుట:Saundarya-Lahari.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

సౌందర్యలహరి


కుండలిని యధిష్ఠించి ముడివేసికొని కూర్చుండునుగాన దీని కీపేరుగలిగె), హుతవహమ్ = అగ్నితత్వమును, హృది = అనాహతమనఁబడు హృదయాకాశమునున్న (కొట్టఁబడని నాదస్థానముగలదిగాన ననాహత మనఁబడెను), మరుతం = వాయుతత్వమును, ఉపరి = అన్నిటికిమీఁదనున్న విశుద్ధచక్రమున నున్న (శుద్ధస్ఫటికమువలె నుండుటచే విశుద్ధమనఁబడు), ఆకాశం = వ్యోమతత్వమును, భ్రూమధ్యే = ఆజ్ఞాచక్రముననున్న (ఆజ్ఞయన నీషద్ జ్ఞానము. దీనియందు దేవి క్షణకాలము మెఱుపువలె మెఱయఁగా సమాధితోఁ జూచు నుపాసకులకు బ్రహ్మగ్రంథిభేద మయి కొంచెముగాఁ బొడకట్టునుగాన నిది యాజ్ఞాచక్ర మనఁబడును), మనోపి = మనస్తత్వమును, సకలమపి = ఈసమస్తమగు, కులపథం = సుషుమ్నామార్గమును, భిత్వా = భేదించి, సహస్రారే = సహస్రారమను, పద్మే = కమల (చక్ర) మందు, పత్యాసహ = ఈశ్వరుఁడగు సదాశివునితోఁగలసి, విహరసి = క్రీడింతువు.

తా. తల్లీ, నీవుమూలాధారస్వాధిష్ఠానమణిపూరకానాహతవిశుద్ధాజ్ఞారూప షట్చక్రములయందున్న పృథివ్యగ్నిజలపవనాకాశ మనస్తత్వములను దాఁటి భర్తయగు సదాశివునితోఁగలసి సహస్రారమనుకమలమునవిహరింతువు. అనఁగా దేవిచతుర్వింశతితత్వములను దాఁటి పంచవింశుండగు సదాశివుతోఁగూడి షడ్వింశతితత్వరూపయైపరమాత్మయని వ్యవహరింపఁబడునని భావము.

శ్లో. సుధాధారాసారైశ్చరణయుగళాన్తర్విగళితైః
    ప్రపఞ్చం సిఞ్చన్తీ పునరపి రసామ్నాయమహనః,
    అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్ఠవలయం
    స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుణ్డే కుహరిణి 10

టీ. హేభగవతీ = ఓతల్లీ, చరణయుగళాన్తర్విగళితైః-చరణ = పాదములయొక్క, యుగళ = జంటయొక్క, అంతః = నడుమనుండి, నిగళితైః = స్రవించిన, సుధాధారాసారైః-సుధా = అమృతముయొక్క, ధారా = ధారలయొక్క, ఆసారైః = వర్షములచేత, ప్రపంచం = డెబ్బదిరెండువేలనాడులను, సించన్తీ = తడుపుచున్న దానవై, రసామ్నాయమహనః-రస = అమృతముయొక్క,