పుట:Saundarya-Lahari.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

టీకాతాత్పర్యసహితము

9

టీ. సుధాసింధోః = అమృతసముద్రముయొక్క, మధ్యే = నడుమ, సురవిటపివాటీపరివృతే-సురవిటడి = కల్పవృక్షములయొక్క, వాటీ = తోఁటలచేత, పరివృతే = కమ్ముకొనఁబడిన, మణిద్వీపే = మణిమయమగులంకయందు, నీపోపవనవతి-నీప = కడిమచెట్లచేత, ఉపవనవతి = ఉద్యానముగలిగిన, చింతామణి గృహే = చింతారత్నములయింటియందు, శివాకారే = శివశక్తిరూపమగు, మంచే = మంచమున, పరమశివపర్యంకనిలయామ్-పరమశివ = శదాశివునియొక్క, పర్యంక = ఉత్సంగ (తొడ) మే, నిలయాం = నెలవుగాఁగలిగిన, చిదానందలహరీం-చిత్ = జ్ఞానరూపమగు, ఆనంద = నిరతిశయసుఖముయొక్క, లహరీం = తరంగరూపమగు, త్వాం = నిన్ను, కతిచన = కొందఱు, ధన్యాః = కృతార్థులు, భజంతి = సేవించుదురు.

తా. తల్లీ, అమృతసముద్రమున కల్పవృక్షములతోఁపులచేఁ జుట్టఁబడిన రత్నపులంకలో కడిమిచెట్లతోఁటలుగల చింతామణులచేఁ గట్టినయింటిలో త్రికోణరూపమగు తల్పమున సదాశివుని తొడయందున్న జ్ఞానానందతరంగ మగు నిన్ను ధన్యులు కొందఱు సేవింతురు.

శ్లో. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం
    స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరి,
    మనో౽పి భ్రూమధ్యే సకలమపి భిత్వాకులపథం
    సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసి. 9

టీ. హేభగవతి = ఓతల్లీ, త్వమ్ = నీవు, మూలాధారే = మూలాధారచక్రమందు (అన్నిటికి నాధారము గనుక యీపేరుగలిగెను), స్థితమ్ = ఉన్న, మహీం = పృథివీతత్వమును, మణిపూరే = మణిపూరచక్రమందున్న (ఇచటనుండి దేవి మణులచే నీచోటును నిండించుఁగాన దీని కీ పేరుగలిగె), ఇందుచే సమయాచారపరు లాంతరపూజ సేయువేళ మూఁడవకమలమున దేవికి నానారత్న ఖచితభూషణము సమర్పణము సేయవలయునని సూచితము. కమపి = ఉదకతత్వమును, స్వాధిష్ఠానే = స్వాధిష్ఠానచక్రముననున్న (ఇచ్చట