పుట:Satya harishchandriiyamu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

సత్య హరిశ్చంద్రీయము

షష్ఠాంకము


(రంగము : కాశీపుర స్మశాన పరిసరారణ్యము)

(పిమ్మట గాలకౌశికుని శిష్యులగు కేశవ జనార్దనులతో లోహితాస్యుడు ప్రవేశించుచున్నాడు)

(గేయము - పార్శీమెట్టు)

అందరు - ఆటలాడుదమా చెండ్లాటలాడుదమా వాటమైన త్రొక్కుడు బిళ్ళాటలాడుదమా ॥ఆట॥ చెట్టులెక్కుదమా లేక గుట్టలెక్కుదమా అట్టు నిట్టు జీగురుబండలందు జాఱుదమా ॥ఆట॥ కూఁత వెట్టుచు దాగిలిమూత లాడుదమా ॥ఆట॥ ఆతరువు క్రింద గోలిలాటలాడుదమా ॥ఆట॥

లోహి - మిత్రులారా!

గీ. ఆటలకు వేళలేదు సాయంతనంపు టగ్నిహోత్రములకు వేళయయ్యె నిప్పు డయ్యవారలు ముక్కోపులగుట మీకుఁ దెలియునేకద రండు దర్భలను గోయ.

కేశ - జనార్దనుడా! పాపము! లోహితాస్యుని కీనాడెన్ని దెబ్బలు తగిలినవిరా! అందుకే వీఁడు భయపడుచున్నాడు.

జనా - మనలను గూఁడ గొట్టునేమో రండు. తలకొకదారిం బోయి దర్భలఁ బత్రములఁ గోయుదము. (అట్లు చేయుచున్నారు)

లోహి - (నడచి పూలఁగోసి) ఈ పూలతావి చక్కగా నున్నది. ఇవి మా కాలకంటికై తీసి కొనిపోయెదను. ఇదిగో నీ పుట్టమీద దర్భలు బాగుగా బెరిఁగినవి. అందరి