పుట:Satya harishchandriiyamu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విశ్వా _ ఓహో! నూతనము గా నీ వొక్కండవు ధర్మశాస్త్రవేత్త వున్నాఁడ వని నా కిది వఱకుఁ దెలియదు.

దేవే _ గాధేయా! నీవు చక్కఁగా నాలోచింపుము. పోనీ, వసిష్ఠుండు నుడివిన ధర్మశాస్త్ర మాచరణమునం దుంచుకొనినవాఁ డెవ్వఁడైన నున్నాఁడేమో యీ సభ్యులనడుగుదము. మునివృషభులారా!