పుట:Sati Anasooya.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



సతీ అనసూయ

కథా సంగ్రహము

భూలోకమందలి పాపాత్ములు తమతమ పాపముల బాయ గంగలో స్నానము చేసినందు వలన వారివారి పాపములు పాపాత్ములను విడచి గంగను వెన్నంటి బాధించుట.

గంగాదేవి పాపరూపముల భాధకు సహింపక తపింపుచుండ ఒక మహాపతివ్రత నాశ్రయించిన ఆ పాపములు నశించునని ఆకాశవాణి పలుకుట.

గంగాదేవి సకలలోక మాత యగు లక్ష్మీదేవి నాశ్రయించుట.

లక్ష్మీ పార్వతీ సరస్వతులు గగాదేవి పాపముల నుపసంహరింప ప్రయత్నించి విఫలమనోరధలగుట.

నారదుడు గంగాదేవితో భూలోకమం దనసూయ యను మహాపతివ్రత కలదు, ఆమెను ప్రార్థిపుమని పంపుట.

నారదుని మాటపై దేవీ త్రయమునకు అసూయ జనించి అనసూయను పరీక్షింప పట్టుదల వహించుట.

మల్లికయను స్వైరిణి తన భర్తయగు సోమశర్మను విసర్జింప సోమశర్మ యిల్లు వెడలిపోవుట.

నీరు లేని శతమున లోకము దాహదాధచే పీడిపబడుట; కొందరు అత్రిముని ఆశ్రమము చేరి నీరు నడుగుట; అనసూయ జలముకొరకు వెళ్ళుట.

నర్మదయను పతివ్రత, తన భర్త కౌశికుని కామవాంఛదీర్ప మల్లి కాగృహమునకు రాత్రి వేళ తన భర్త నెత్తుకొని పోవుట,