పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

విశాఖపట్టణము


(సనస్య) బిగిచను లేతమాడగనుబియ్యము దంచె లతాంగి వేఁడుకన్.

చ|| అగణితమైన వేగమున నట్టిటు వంగుచు లేచుచున్ ఘనం
బుగ దరు రీతి బాటలను బోల్పుగఁ బాడుచు " సువ్విసువ్వి "లయం
చొగిముసలమ్ముకేలగొని యూగుచు జోగుచు, ఱొమ్ముగొట్టుచున్
బిగిచను లేతమాడగనుబియ్యముదంచెల తాంగి వేడుకన్5

శ్రీ శ్రీ శ్రీ

నెంచి య ఈశార్వరి॥ సం॥: జ్యేష్ఠమాసము. ఈ విశాఖ పట్టణమునందే రచియించిన మరియొక యష్టావధానములోఁ గొన్ని

(సమస్య) :గుమ్మములో నున్న ముద్దుగుమ్మన్ గాంచెన్ ,

క|| కమ్మవిలుకాని చిల్కన, సమ్మదమొన రించుచున్ ప్రశస్తం బగురీ
తిమ్మనమునగరంపగదా గుమ్మములో నున్న ముద్దుగుమ్మంగాం చెన్.

(సమస్య) బండ్ర గిక్కడి కెంతదవ్వెచెపుమా? పంకేజప త్రేక్షణా


శా॥గుండ్రా కావలే నంచు నే నడుగ నాకుం బల్లెవా రందఱున్
బండ్రంగింగల దంచు జెప్పి రది నాభావమ్ములో నెంచి యు
వ్యాండ్రన్ మెచ్చుచు జాని గొంటయి యీ ప్రాంతస్థిలిన్ జేరితిన్
బండ్రంగిక్కడి కెంత దావె చెపుమా? పంకేజపత్రేక్షణా 2

(సమస్య)శృంగాగ్రాదపతస్మృగవ్యరుదతో బాష్పాంబు భూమండలే


శ్లో||గత్యాకశ్చన భూపతి ర్మృదుగతిద్భూద్రాకులం కాననం
ధృత్త్వెకం ద్గనుషాశరం ప్రహత వాన్ మార్గం శిశుం కోపతః
పుత్రం బాణహతం విలోక్యనరతో భీత్యాతదా భూమిభృ
చ్చృంగా దాత స్నృగస్య రుదతోబాష్పాంబు భూమండలే.3

(సమస్య) రంగులుఘోషించెమేఘరావముపోల్కెన్.



క॥రంగుమెయి హూణులంఱు బొంగుచు వందలకొలంది యోయర్సుపయిన్
సంగతముగ గాల్పించుఫి,రంగులు ఘోషించె మేఘరావము పోల్కెన్.

(సమస్య)సింగములన్ మట్టె గంధసిందుర మయయో


క||పొంగుచున్ గొందరు రాజులు,సింగారము లొలుకవేటసేయంజని వే
డ్కన్ దెలనందెరుగ నారా,సింగములన్ మట్టెగంధసిందుర మకటా.

శ్రీ శ్రీ శ్రీ