పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ తావధా న సారము, ఉత్తరార్థము

79


.

ఈశార్వరి వత్సర వైశాఖమాసములోనే మరల విశాఖపట్టణము లో జరిగిన యుష్టానధానము లోఁ గొన్ని ,

ఇష్ట దేవత

,

ఉ|| విక్రమదేవర్మ పృథివీపతి రత్న ముకోర్కె మీఁన ప
మ్యక్కృతికర్త లౌ ననగ నష్టవధానము చేయు వార మీ
ప్రక్రియయందు లోపములు పాల్పడకుండఁగఁ జేసి ప్రోవుమా
వక్రవచః ప్రసంగిమద వారిణి! యోజగదంబ! సత్కృపన్

రామాయణము, మత్త కోకిల,


సార సాప్త కులమ్ము సందు వెసక జనంచి యరణ్యమున్"
జేరి వాటి విరాధముఖ్యులఁ జీరి వాలిని మారి వి
స్ఫారశక్తి యెలర్ప జాలను వార్థి గట్టి చలంబు మై
గ్రూరు రావణుఁ జంపి సీతను గొన్న రాముఁ దలంచెదన్!",2

(సమస్య) పాదములు లేనితరులు పరుగిడఁజొచ్చేన్ ,


క|| ఏదెస వాసలు గురియన్, గోదావరి పొంగి వచ్చె గుములుగ సందున్
వే దొరలి నీట దృఢతర, పాదములు లేనితకులు పరుగిడఁ జొచ్చెన్ ,3

(సమస్య) సతి సతిఁ గవియంగఁ బుత్రసంతతి కలిగె .


గ|| అతికుతుకం బలరారఁగఁ జతురత మెజయంగ మగనశాస్త్ర విధమునన్
వితతం బగుత నసౌధవ,సతి సతీఁ గవియంగఁ బుత్రసంతతి గలిగెన్4

...................................................................................................................

సీ|| సంస్కృతాంధ్రమ్ములఁ జక్కఁగ మా ప్రజ్ఞులను జూప మోదంబుగ ను టెకాని
భాగ్యవంతులరీతి బహువిధసత్కారముల నాచరింపఁగఁ గల నెసూకు
| విద్యాధికులభాతి విని మెచ్చుటయెకాని సరసత నొప్పు తప్పరయఁగల నె|
తే), గీ|| కుక వినికరంబు
చౌడ్పునఁ గూయఁగలనె |
యెందు నను మందుడను గాన నెఱిఁగి నాదు | చిన్ని వి
న్నపమాలించి యన్న లార !
తగువిహితులార నుక వివతంసులార! || 1||
ఒక్కపూటైన నాయింట మిక్కిలిదయ | గలకొలందిని భోజనంబుల నొనర్చి |
నన్ను సంతోష. పెట్టుఁడు నాఁటివలే నె |
యింతకం టెను గోర నే నెద్దీ మిమ్ము | 2 ||

విశాఖపట్నము.

విధేయఁడు,

28-5-1900

మంతెన ఆదినారాయణమూర్తి పంతులు.