పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

75

గజపతినగరము,


శార్వారి సం||వైశాఖమాసము లోనే గజపతి సగరములో చేసిన యుష్టానధానము లోని కొన్ని పద్యములు,

ఇష్ట దేవతా ప్రార్థన

చ : తరతమభావ మెన్న కిటు తల్పము నందుఁ బరుండె నెన్వఁడో?
తరుణికపర్ది నొడయినతల్పమునందు బరుండియుంటి, నా
నరుడు తదేక భూతి గల హను దరిద్రుఁడు గాఁ డటంచు శం
కరుని హసించుగౌ రియెనకంబిడు మీకును మాకు నిచ్చలున్ ,10

విజయగరంమహారాజావారి మరణమునుగూర్చి జనులుచింతించుట,

సీ|| వర్షాశనార్థంబు వచ్చుపండితకోటి పోలు పుమాజఁగ రాకపోక లుడి
గె | నెలజీతముల గృహముల నుండి జీవించుగాయకుల్ పరదేశగతి
నిఁ జెంది | రతులి తై శ్వర్యము లలరారునుద్యోగితతుల కుద్యోగ
ముల్ తప్పిపోయె ! నదూరమున నుండి యరు దెంచుపాంధుల కన్న
దాసంబు లేదనుట గల్లె:

తే.గీ: కవులువచ్చుటనూనిరిగాయకులు వి
చార వారిథి మునిఁగి యిచ్చటికి దూర
దేశములనుండి రారని తెలివి గల్గు
వారలానంద నృపు సెంచి వంతగాత్రు,11

శ్రీ శ్రీ శ్రీ

సీ: ఎఱుఁగని భాషలో నెర పె వ్యస్తాక్షరి యహహ జ్ఞాపకశక్తి యని నుతింస |
మాటలనందడి మఱపించి వాయించుగంట లెన్నుట గాంచి గణుతీ సేయ |
నంతలోజతురంగ మం దెత్తు వేసెడు బుద్ధిచాతురిగాంచి పొగడుచుండ |
కోరిన పద్యముల్ లోవల సందీయక ముండె చెప్పఁగ మోదమంది మెచ్చ,

తే!! గీ| నడుమను బురాణమును న
ర్దమడుగఁ జెప్పి| యారయ స్థావధానము నాచరించి |
మేల్మిఁబొట్టా పేదచ్చని మొప్పుగాంచి |
నరసీ తీరుపతి వేంటేశ్వర సుక వులు || 1||

గజపతినగరం,

దేశగుప్త సన్యాసిరాజు,