పిఠా పుర ము .
67
విప్రలంభము మందాక్రాంతావృత్తమ్.
తౌ వక్షోజౌతదపి వదనం తాదృశా దృష్టి పాతా
స్త ద్వై యానం, సచ కచభర స్తాదృశ శ్రోణి భారః
ఇత్యంగా నా మసుకల మపిస్ఫూర్తిమాలోకమానః
కాలం నిన్యే ప్రియ సహచరీవిప్రయో గేణ కశ్చిత్8
రంభారావణసం వాదము.
చ|| పలికితి వీవు నొడలను బట్టకు నన్నని, వార కాంతకున్
గలుగునె యిట్టి భేదములు గంగొను తండ్రియుఁ బుత్రుఁడు గ్రమ
మ్మలరఁగఁ గూడి యొక్క నదియందునఁ గ్రుంకుట లేదా? యేలయీ
చల, మధరామృతం బి ఫుడొసంగి ననున్ దయఁ జూడు కోమలీ.9
కుమా గలింగేశ్వరుఁడు ప్రహర్షి ణీవృత్తమ్
భక్తానా మభిమత దాయినం మహాంతం
ధ్యాయామో మనసి సదా కుమారలింగం
నీరేజాసన ముఖ దేవతా వతంసా
యన్నామ ప్రతికల మాదరాజ్జపంతి. 10
పరకీయావిషయిక యోజన.
మ||మితికాలం - బరు దెంచునే చెలియు నా మేలెంచి కీలెంచునే
ధృతి పూసన్, సమకట్టునే యితరసం దేహంబు పోకార్చునే
పతి గ్రామంతర మేగునే. యితర నిర్భంధమ్ము లేకుండునే
కుతుక మ్ముల్ నెఱువేఱునే? ప్రియసఖా! కోర్కుల్ తుదల్ ముట్టునే11
ప్రసంగవశమునఁ జెప్పినది.
చ|| ఇతరకవుల్ ప్రయాసపడి యెంచి రచించిననూటి కెన్ని పె
ద్దతనము గాంచి చిత్తమునుదంపును నో మవధానసంగత
స్థితిగని యాశుగా రచన చేసినపద్య ములందుఁ జూచినన్
శతమునకన్ని పద్యములు చక్కఁగ నుండు నసంశయముగన్.12
హేమలంబి సం||చైత్రమాసములో గుంటూరులో జరగిన య
వధానము లోని 30 పద్యములలోఁ గొన్ని పద్యములు.