పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/78

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

శతావధాన సారము, పూర్వార్థ ము '

తిరుపతి వేంకటేశ్వరుడు


<poem>సీ|| కాచినాఁడవుక దాకరిరాజు ప్రాణమ్ముకఠినక్రమును జక్రము సం! ద్రుంచి
(ప్రోచినాఁడవుక దాపూర్వ దైతేయ డింభకునివేవేగఁగంబమునఁ బొడమి
దాచినాఁడ వుక దానా ద్రౌపదీ మానము సభలోసం బెక్కువ స్త్రమ్ములొసగి
చూచినాఁడవుకదాసోదరున్ విడనాడి శరణుజొచ్చినవిభీషణుని బ్రీతి

తే.గీ|| ననుచు నిను, జేరినార మత్యాశ చేత
మమ్మురక్షించుచెంతయమ్మక్క నీకు
సరనతిరుపతి వేంక టేశ్వరకవీంద్ర
శరణ తిరుపతి వేంక టేశ్వర! నమోస్తు4

కుంతీమాధవుఁడు.


మ|| స్థిరభక్తిన్నుతియింతు నెమ్మ దిని గుంతీమాధవ శ్రీధవున్
జరణద్వంద్వమునన్ శిరంబునిచి వేసారుల్ నతు ల్ సల్పుచున్
గరుణాసాగర కావవే! సమజగత్కళ్యాణ రక్షింపవే
పరమోదార యనుగ్ర హింపు మనుచున్ బల్మారువా క్రుచ్చుదున్ 5. .

అమర, భ్రమర, సమర, కొమర, అను పదములు వచ్చునట్లు చెప్పుట
మధు కైటభయుద్ధము


చ|| కొమ రలరంగ నెంతయును గోర్కె దలిర్ప మనోజసంగ ర
భ్రమ రహిమీఱ రక్కసులు పద్మ దళా కణునితోడఁ జేయు నా
సమరము మాని దేవిని వెసన్ గొన నెంచి పరాంబమోము పై
నమర నిగుడ్ప సాగిరి కటాక్షములన్ జెల రేగి మంటికి? 6

యౌవన ప్రారుర్భావము శార్దూలవిక్రీడితమ్


వక్షోజౌ లికుచోపమా ప్రతిపదం వృద్ధ్య న్ముభౌదృష్టయ
స్సొరంసార మధీయతే ప్రతికలం చారుత్వ వక్రత్వయోః
మధ్యం కార్శ్య ము పై తి గచ్ఛతి గతి ర్మాంద్యం విలాసోదయా
నావిందంతి వచాంసి నీరజదృశ స్తారుణ్య బాల్యాంతరే,7