పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

శతావదాన సారము పూ ర్వార్థ ము "

యః కౌమూరహరం అనుశ్లోకమునకు తెలుఁగు.


సీ|| చిన్నారిపొన్నారి చిఱుత ప్రాయము చూఱ(గొన్న వాఁడె ప్రియుండు కో
మలాంగి, తఱపి వెన్నెలలతో నొఱుపు గల్గిన నాఁటి చైత్రరాత్రులె క
దా! సరసిజాక్షి | మాలతీపరిమళ వ్యాలోలములు నాఁటిసేపవాయు
వులెకా! నీరజాస్య తలఁపు లొక్కటిగాఁగఁ గలసి కుల్కిన. నాటిదాననే
కద, యేనుఁ దలిరు బోఁడి:.

తే! గీ|| నా సురత ప్రసంగమే బోఁటిమిన్న
యైన నాయన మది యేమొ కాని మేటి
నాఁటి నేనానదీ తీర నాటి నొప్పు
నేత సీతరు మూలమ్ము వెనకఁబోవు.2

ఈ ముంగుపద్యములో రెండుచరణములన్న రవఱకును సమస్య గా నీ బడ్డది,
సీ|| (నిలువుటద్ద మెమెదుట నిలిపి చూపితిఁ గాని పలు కెంపు లేమని పలికినాన
పసమీఱు దుప్పటి పై నిఁ గప్పితి: గాని పసపురం దేమని పలికి నాన
విరులసురటి దెచ్చి విసరుచుంటినిగాని) చెమట దేమనిపృచ్ఛ చేసి నాన
పవళింప విరిపాన్పుసవరించి తినిఁ గాని యూ మాసమేముని యడిగినాన,

తే|| గీ||. మొగము వెలవెలఁ బోయిన మూల మేమి?
యెఱుపు గనులందుఁ గల్గిన హేతు వేమి?
నాథ నాయందు లోపము న్నను క్షమింపఁ
బాడి యగుఁగాక తప్పులు పట్టఁ దగునె! 3

(సమస్య) రండలదర్శింపఁగోరు రాజులమనముల్ .


పూర్తి


క|| పండిత వాక్య శ్రవణము, దండుగఁగా నెంచి దానఁదగులు కొనవు పూ
కుండలు గడిగెడి దాస్యపు, రండల దర్శింపగోరు రాజుల మసముల్ •

(సమస్య) ఒడ్డాణమలంకరించెను? విదకుచంబుల్ ,


పూర్తి.


క|| అడ్డమయినట్టి విటులకు, బిడ్డలఁగని బిరుసుదక్కి బింకము చెడి యా
బిడ్డలు పాలకునీడ్వగ, మెుడ్డాణమలంకరించెను విదకుచంబుల్ •