పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

శ తా వ ధా న స ర ము, పూర్వార్థ ము •

<poem>

వీరేశలింగముగారు చేయు విధ వివివాహము లను గుఱించి.

సీ|| "మా డబ్బు చెడదొబ్బె మాప్పబుద్దుఁ" డటంచు మంగలివాండ్లు తన్నుం గుణింప ! పెండ్ల ములకు వండి పెట్టఁగా సుఖ యించు వారలేల్లకు త న్ను దూరుచుండ ! విద్యార్థులును మెట్ట వేదాంతులును గూడి తన్ను నేవేళ నిందను నొనర్ప " | మును చచ్చినట్టిమగ నితద్దినం బెట్టు, లని బుధవరులు వా దొనరఁ జేయ, తేః.గీ|| నన్నిటికి 'మోర్చి విధవలౌ నంగనలకు “భ్రూణహత్యలు జరగక పోవుఁగాక,, యంచుఁ బెండిండ్లు సేయ యత్నించుచుండెఁ గందుకూరి వీరేశలింగ ప్రధాని4

ప్రకృతప్రభువు- మందాక్రాం తావృత్తమ్.

స్మేరం నక్త్రంహృదయ మమలం • శీతలా చ ప్రవృత్తి రూపం తాపాపహ మనృత వాగ్వారణీ ధోరణీచ తుష్టి స్తుష్టా బహు వితరణం పుష్టి, రత్యంతపుష్టా జాగర్తి శ్రీకలితనిల యే నారసింహక్ష్మితీంద్రే 5

రాజుతమ్ముడు.

శా||సారాసారవి వేక యుక్తుఁడు యశస్సంపాద నాత్యంతశో భారోచిష్ణుఁడు, రూపవంతుఁడు కళాభ్రాజిష్ణుఁ డశ్యున్న తా గారారామవి శేషభాసురుఁడు శృంగార ప్రధానుండు సు శ్రీరమ్యుండు కరముఁ జెన్న లరు లక్ష్మీ కాంత రా జెల్లెడన్ 6

మన్మ ధుఁడు.

II కలుకులకంగెనలనుస, మ్ములఁగొని విటరాజు హృదయముల్ పగులగ గా సిలఁజేయుచుమారుఁడు తొయ్య లులకు దాసానుదాసుఁడై చరియించున్"7

రామాయణము.

తే!! గీ|| శివునివిల్ ద్రుంచి జనకుని చెల్మి గాంచి సీతఁ బెండ్లాడి వనికి నేం చేసి పిదప రావణునిఁ దున్ని శ్రీరఘు రాముఁ డతివ తోడఁ బట్టాభిషిక్తుఁడై నాఁడు నాఁడు.8