పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

శ తావ ధా న సార ము, పూర్వార్థ ము


అకాల వర్ష మ్మునందు రాత్రివీధిపంచనుపరున్న మార్గస్థుడు.

సీ||తనయింట నున్న వెచ్చనిశయ్య పలుమాఱు మాససమునను సంస్మర
ణ చేసి ! తనయింట నున్న గుత్త పుగుబ్బలాఁడి మేల్గిలిగింతలను మాటి
| తనయింట నున్న చక్క-నిపచ్చడములఁ బలుమాఱుమ
నమునఁ బలవరించి | తనయింట నున్న మెత్త నికోట్లతండమ్ము లేల తే
లేదని యెంచి యెంచి,

తే! గీ॥కడుపులోఁ గాళ్ల నిఱికించి గడగడగడ
వణకుచును నిద్ర పోసాగె? బాంథుఁ డోక డు
వానతుంపురు లొకకొన్ని మేన బడఁగ
గాలి దగిలెడి యొక పంచపాళిలోస10

జగమోహిన్యవ తారము.


<poem>సీ: అమృతంబు పేరు దైవవ మెఱుంగుఁగాని యీయనుపమాకృతిచూత
యనెడివారు I చూచుట కేమి యీ సుందరీరత్నమ్ము సటు చననీకుఁడీ
యనెడివారు. అట్లేల పోవు నాయందుఁ దాత్పర్య మీయంగన సూ
చించె ననెడి వారు | నీయందు సూచించెనే కాదుకాదు నాయందు
న సూచించె ననెడి వారు,
తే| గీ|| నై రిరకక్క మలెల్లమోహాథోమగ్ను
లగుచు శ్రీమజ్జగ న్మోహనావ తారుఁ
జూచి యంతియ కాని శ్రీశుండ మోస
గాఁడటంచును మది నెఱుంగ రకటకట!11

(ప్రబోధ చంద్రోదయనాటకములోని జలభ్యం లబ్ధ మను
శ్లోకము సకు తెలుఁగు.

చ|| ఇది లభియించె నింక లభియించు లభించిన దాని వడ్డి చే
నదనము 'సేతు నంచు మదియందు సదాధనముం జపించు నీ
కిది తెలియంగ లే దకట! హెచ్చినయాశ పిశాచిరీతి నీ
కుదురునశింపఁ జేయుఁజుమి కూకటి దుంపలతోడ మూర్జుఁడా12

తి! శాం చెప్పినది

.