పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రొత్తపల్లె

53


అవధానము జరగినరోజు,

చ|| పరువడి మన్మథాబ్దమునఁ బౌషమునం మన దర్శయందు సం
దఱికిని మెక్క పాదము ముదమ్మునఁ జెప్పియనంతరంబు నం
దఱికిఁ గ్రమముగా మిగులు దానినిఁ జెప్పి శతావధానముఁ
దిరుపతి వేంక టేశులు విధించిరి జగ్గనృపొలుసన్నిధిన్6

దశావతారములు,

సీ॥! మత్స్యమై యెవ్వాడు మడియించె సోమకుఁ గూర్మమై ధరియించెఁ గుధర మెవఁడు? | పందియై యె వ్వాడు బరిమార్చెఁ గన కాక్షు సింగ మై కశిపునిఁ జీ రెనెవఁడు? | వడుగయి యె వ్వాఁడు బలిసంపద హరిం చె? ద్విజుఁడయి నృపుల మర్ధించెనెవడు ! రాముఁడై యెవ్వాడు రావణుఁ గడ తేర్చె బలభద్రుఁడయి పూనె హలము నెవఁడు? ; బుద్ధుఁడయి బౌద్ధమత మెవ్వఁ డుద్ధరించె గల్కియై యెవ్వఁడు కలిశిక్షణ మొనర్చె నట్టివిష్ణుని వితతదశావతారు జేరి రక్షింపు మనుచు జోహా రొనర్తు,10

....................................................................................................................

సూర్యాలోక ముచేత రంజిలుటచే శంభ దయాదేవతా | ధుర్యం బైతగె జగ్గ రాయ నృప తీ! తోరంపు నీకొల్విల న్| 7 || శ్రీ.

సీ॥| ఎవరేమికోరిన నెలమితో నవియెల్లవర్ణించి పద్యముల్ వరుసఁ జెప్పి | యెవరేమి యడిగిన నింపుగా సవియెల్ల శాస్త్ర సమ్మతముగా సరవిఁ దెల్పి | యెవ రెట్టిపద్యమ్మ లెన్నే నిఁజదివిన వానియర్ధంబులు పల్కుచుండి | యేవ రెట్లు చతురంగ మింపుగా నాడిన