పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రొత్త పల్లె

51


(ప్రకృతకవులగురువు), శార్దూల విక్రీతం.

శ్లో|| యేన శ్రీధవళాచలే విరచితం సత్రం పవిత్రం చిరా
ద్యస్యానంతవి దేశచారణచణా స్సర్వే ఽపి విద్యార్థినః
యత్కీర్తి గ్వియ దాపగావరఝ రీబిందూ సమా రాజతే
చర్ల బ్రహ్మసుధీశ్వరో విజయతే సోఽయం మదీయో గుగుః5

(శిశిరస్తుః) : మందాక్రాం తావృత్తమ్.

మళ్లీ నల్లీ కుసుమహితా మారుతా మందమందా
శ్శీతో నీతః పరిభన మితీవోహ్య తే దంప తిభ్యాం
కించిత్కించి త్ప్రనహతి జలం తత్తదుచ్చైర్న దీనాం
మా ఘే ప్రాప్తే గమయతీ రథం చోత్త రాశామునూరుః-6

...................................................................................................................

తుమర్హౌ || 7 | శ్లో|| ఆచీకర ద్యస్వవధాన యుగ్మం|యేచాస్య జామాతృ సు లౌధివర్గాః ! యాసంవ్యధ త్వాం సచ తేచ తౌద ! భూయాసురారోగ్య శతాయు రాఢ్యా||8| శ్రీ.

సత్య వోలు సోమసుందరకవి విరచితములు,

చ|| తిరుపతి వేంక టేశ్వరుల దివ్యకలా మహిమాను భావ మీ ! తిరుపతి వేంక టేశ్వరుల ధీవిలసత్ప్రతీ భావివర్త మై | పరిణతి చెందె గాన రసవత్కవితాష్ట శతావధాన వి! స్ఫుర ణము మీఱె వీరలకు నూరిజన ప్రభు! జగ్గ రాడ్విభూ॥ 1||సీ||బహుసువర్ణాధిక్య భాస్వరులయ్యును సీస సంకలనచేఁ జెలువు గాంత్రు | సత్కవీశ్వరులయ్యు శార్దూల మత్తేభ విక్రీడితములచే వెలయుచుండ్రు | చెలఁగి ద్వి రేఫత్వసిద్ధి నొందియు వీరు చం పక స్వీకృతి సలుపు చుంద్రు ! అనిశంబు వీరు సూర్యాఖ్యను గాంచియు నుత్పలా మో దంబు నొసఁగుచుంద్రు| సుదినక రులయ్యు రాజు చే శోభ గాంతు | సరసతిరుపతి వేంక కేశ్వరసుకవులు | చిత్ర మై యొ ప్పె వీరచరిత్ర మిలను | రావుకులదీప! శ్రీజగ్గరా యభూప|| 2|| మ || వితతప్రజ్ఞ శతావధానతయు నేవేళన్ సహస్రావధా | నతయున్ గల్గిన వీరిచిత్త మున కే నాళీక నామంబులౌ | శతపత్రంబు సహసపత్ర మనుటల్ సంద ర్భమౌఁగాక స | మ్మతమా? యెల్లెడ మానసాబ్జమను సామాన్యోక్తి చర్చింపఁగన్ || 3 || సీ|| శ్రీక రంబగు కవితాకన్య యీధన్యక వియుగ్మరూపంబు గారిచే నోక్కొ | భవ్యవి ద్యారూప భారతి యీరీతి విబుధ ద్వయాకృతి వెల సెనొక్కొ | భావింప నాధార ణావతి యీరీతి నిరువును పురుషులై పరఁగెనొక్కొ | రాజితం బగు ప్రతి భాజాలమిలీలఁ